ప్రజా సేవల హక్కు చట్టం (Right to Public Service Act)

ప్రజలకు హక్కుగా లభించాల్సిన ప్రభుత్వ సేవలను నిర్దేశించిన గడువులోగా అందించేందుకు, అలాగే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం లేదా జాప్యం కారణంగా సేవలు అందకపోతే అటువంటి అధికారులకు జరిమానా విధించేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు దేశంలోని 22 రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చాయి. కాని, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం.

ఈ చ‌ట్టం ప్ర‌కారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం తప్పనిసరిగా పౌర హక్కుల పత్రాన్ని (Citizens Charter) రూపొందించాలి. అందులో ఏయే సేవలను ఎన్ని రోజుల్లో అందిస్తారో, ఆయా సేవలను అందించడానికి బాధ్యత వహించే అధికారి ఎవరో స్పష్టంగా పేర్కొనాలి. నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారి సేవలను అందించని పక్షంలో, బాధిత పౌరుడు పై అధికారికి అప్పీలు చేసుకునే అవకాశం కల్పించాలి. అప్పీలు అధికారి విచారణ జరిపి, సరైన కారణం లేకుండా లేదా ఉద్దేశపూర్వకంగా సేవలను అందించని పక్షంలో స‌ద‌రు అధికారికి జరిమానా విధించ‌డానికి ఈ చట్టంలో పొందుబ‌టు కావించ‌బ‌డింది. అలాగే ఈ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించడానికి కమిషన్ ఫర్ రైట్ టు సర్వీస్…….

Monthly News Letter 2025