FGG TIMES
సుపరిపాలనే ధ్యేయంగా
Editor: T. Vivek, Associate Editor: Prof. Raghuram Rao Akkinepally
Vol. No. 1 | Issue No. 2 | Monthly News Letter | February 2025
Launch FGG Times, on 26th January 2025 by Sri M. Padmanabha Reddy, IFS (Retd)
In Focus
ఓటర్ దినోత్సవం
దేశంలో ఎన్నికల కమీషన్ ఏర్పాటు వారికి కావలసిన అధికారాలు, విధులు భారత రాజ్యాంగం అనుకరణ 324 నిర్థేశిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల అధికారి మరియు ఇతర కమీషన్ సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఎన్నికల కమీషన్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. అనుకరణ 324 ప్రకారం దేశంలో 25 జనవరి 1950 సంవత్సరంలో ఎన్నికల కమీషన్ స్థాపించబడింది. అటు తరువాత 2011లో, జనవరి 25, 1950 రోజును ఓటరు దినంగా పరిగణిస్తూ ప్రతి సంవత్సరము ఓటర్ డే ను నిర్వహిస్తున్నాము.
భారత ఎన్నికల కమీషన్ వారు దేశ పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ మరియు మండలి ఎన్నికలు జరుపుతారు. అలాగే రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడ నిర్వహిస్తారు. ఎన్నికలు జరపడానికి మొదటగా 18 సంవత్సరములు దాటిన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేసి ఎన్నికలు నిర్వహించాలి. అయితే పౌరులు కూడ తాము ఓటరు పట్టికలో పేరు ఉన్నది లేనిది తెలుసుకోవాలి. కొన్ని సందర్భాలలో ఓటరు పట్టికలో నుంచి పేర్లు తొలగిపోవడం కూడ జరుగుతుంది. ఈ విషయం ఎన్నికల కమీషన్ వారు ఓటరు పట్టికలు తాలూకా ఆఫీసు నోటీసు బోర్డులలో పెడతారు. అలాగే పోలింగు బూతుకు ఒక బూతు స్థాయి అధికారి కూడ ఉంటారు. వీరి వద్ద ఓటరుగా నమోదుచేసుకునే వీలుంది. అదీకాక కమీషన్ ఓటరు నమోదుకు సులభ మార్గాలు సూచించింది.
ఓటరుగా నమోదు చేసుకోవడం ఒక ప్రక్రియ అయితే పోలింగు బూతు వరకు వెళ్ళి ఓటు వేయడం, ఇతరులను కూడ ఓటు వేయడానికి ప్రేరేపించడం ఇంకో ఎత్తు. భారత ఎన్నికల కమీషన్ వారి లెక్కల ప్రకారము ప్రస్థుతము దేశంలో 100 కోట్ల ఓటర్లు నమోదైనారు. ఇంతకు పూర్వము మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల ఓటర్ల కంటే తక్కువగా ఉండేది. రాను రాను ఇది తగ్గుతూ ప్రస్థుతము మహిళా ఓటర్లు కూడ దగ్గర దగ్గరగా పురుష ఓటర్లతో సమానంగా ఉన్నారు. గత కొన్ని ఎన్నికల ఫలితాలు పరీక్షించితే గ్రామ ప్రాంతంలో పోలింగు శాతం 90 వరకు ఉండగా పట్టణాలలో 50 నుంచి 60% వరకు పోలింగు జరుగుతుంది. పట్టణాలలో చదువుకున్న వారి సంఖ్య అధికంగా ఉన్నను విద్యావంతులకు ఎన్నికలపై అనాసక్తి ఉంది. దీనికి ముఖ్యకారణం బరిలో ఉన్న అభ్యర్థులు వారికి నచ్చకపోవడం.
ఇకపోతే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్నాయి. ఎన్నికల కమీషన్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి 40 లక్షలు మించకుండా అలాగే పార్లమెంటుకు 95 లక్షలకు మించకుండా ఖర్చు చేయాలని ఆదేశాలు ఇచ్చినా వాస్తవానికి చాలామంది అభ్యర్థులు కమీషన్ విధించిన సీలింగు కంటే 100 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ప్రజలు ఓటును అంగట్లో అమ్ముకునే సరుకు క్రింద పరిగణించి ఓటు అమ్ముకుంటున్నారు. ఇది ఈ నాలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులలో అంగబలము, అర్థబలము ఉన్నవారే ఎన్నికలలో పోటీ చేయడం, గెలువడం జరుగుతుంది. దీనికి తోడు రాజకీయపార్టీలు కూడ ప్రజాధనాన్ని వాడుకుంటూ అంతులేని ఉచితాలు (హామీలు) ఇవ్వడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారి, రాష్ట్రం అప్పుల పాలవుతుంది. అలాగే ప్రజలు కూడ ఎన్నికలంటే ఉచితాలు అలాగే ఓటు అమ్ముకోవడం, మద్యంలో మునిగితేలడం, కులం పేరున, మతం పేరున ఓట్లు వేయడం జరుగుతుంది. మంచివారు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. దానితో నేరచరిత్రులు, భూకబ్జాదారులు మన చట్ట సభలలో కూర్చుంటున్నారు.
ఇకపోతే ఎన్నికల కమీషన్ కూడ ఎన్నికల నిర్వహణకు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చుచేస్తుంది. ఇట్టి ఖర్చుకు ఎటువంటి ఆడిట్ జరగడంలేదు. ఉదాహరణకు మొన్న తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పోటీదారు రూ. 95 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. అదే ఒక పార్లమెంటు సీటు ఎన్నిక నిర్వహించుటకు తెలంగాణలో కమీషన్ వారు అక్షరాల రూ, 36 కోట్లు ఖర్చు చేసినారు. ఇంత ఖర్చు ఏవిధంగా చూసినా సమర్థనీయం కాదు.
రాజకీయపార్టీలు గెలుపు గుర్రాలను మాని, మంచివారిని ఎన్నికలలో నిలబెట్టాలి. అలాగే ప్రజాధనంతో పనికిమాలిన ఉచితాలు, గ్యారంటీలు, హామీలు మాని పేదలకు మంచి విద్య, నాణ్యమైన వైద్యం, ఉపాధి వంటి వాటిని అందజేయాలి.
ప్రస్థుతము జరుగుతున్న ఎన్నికల సరళి గమనించినప్పుడు మనం ప్రపంచంలోనే అది పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నా మన ప్రజాస్వామ్యం ఏవిధంగా నడుస్తుంది ? అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయా ? ముఖ్యంగా అణగారినవర్గాల అభివృద్ధి ఎంత మేరకు జరుగుతుంది అన్నది ఒక జవాబులేని ప్రశ్న.
యం. పద్మనాభరెడ్డి
అధ్యక్షులు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
ఉద్యోగులు వేళకు రండి
ఒక కర్మాగారంలోకి కార్మికుడు కాస్త ఆలస్యంగా వెళితే హాజరు పడదు. బోర్డింగ్ దగ్గర ఒక నిమిషం ఆలస్యమైతే విమానాశ్రయంలోకి వెళ్ళనివ్వరు. పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వెళితే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ప్రైవేటు కార్యాలయాలకు, పాఠశాలలకు కళాశాలలకు ఆలస్యంగా వెళితే అక్కడ వేటు తప్పదు. ఉద్యోగులు క్రమశిక్షణతో తమ విధులకు హాజరు కావాలి లేకపోతే వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేరు . ఇవన్నీ కూడా మన సమాజంలో మనము ఒక వైపు చూస్తూనే ఉన్నాం. చాలా వరకు మన అనుభవంలోకి కూడ వస్తాయి. మరోవైపు మనం నిత్యం ప్రభుత్వ కార్యాలయాల్లో ఎదురౌతున్న సంఘటనలు కూడా చూస్తుంటాం.
రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు నిత్యం సేవలందించవలసిన ప్రథమ కర్తవ్యం, వారి బాధ్యత. ఉద్యోగులు ప్రజల పన్నులతోనే జీతాలు పొందుతారు. ఉద్యోగ భద్రత కూడ ప్రభుత్వము కల్పిస్తుంది. తుది పనిరోజు వరకు అంటే తన పదవీకాలం వరకు ప్రతి నెల జీతము, దానితో పాటు ప్రయాణ ,రోజువారీ భత్యాలతో పాటు మెడికల్ అలవెన్సులు పొందుతారు. పదవీకాలం ముగిసిన తరువాత కూడ తన తుది శ్వాస వరకు పెన్షన్ వస్తుంది. ఆ తరువాత తన భాగస్వామికి కూడ తన తనువు చాలించేంతవరకు పెన్షన్ ఇవ్వడం మన ప్రభుత్వాలు కల్పిస్తాయి. ఈ సమాజములో ఇటువంటి భద్రత ఏ ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగులకు లేవు. ఈనాడు ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగ భద్రత లేదు. కొన్ని ఐ.టి. రంగసంస్థలలో తప్ప ఇతర సంస్థలలో కనీస అవసరాలు తీర్చుకొనడానికి కూడ జీతాలు లేవు . ప్రైవేటు సంస్థలలో కనీసము 10 నుంచి 12 గంటలు ప్రతిరోజు పనిచేయాలి. ఒక పంచింగ్ మిషన్ ను కూడ ఉద్యోగుల పనివేళలు చెక్‌చేయడానికి పొందుపరుస్తారు. దానికి అనుగుణంగా జీతాన్ని ఇస్తారు. ప్రభుత్వంలో ప్రజలకు ఉత్తమ సేవలందించడానికి సమాజంలో మంచిని పోషించేందుకు ఉద్యోగులకు ఎన్నో కఠినమైన రాత మరియు ఇంటర్వ్యూ పరీక్షలు నిర్వహించి ఉత్తములను ఎంచుకొని ఉద్యోగమును ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తుంది. వారి అర్హతను బట్టి స్థానాన్ని కల్పిస్తూ వేళకు పదోన్నతి కూడ లభిస్తుంది. మన సమాజము నుండి ఇంత మంచి గౌరవం లభిస్తున్నప్పటికీ ఉద్యోగుల నుండి ప్రజలకు అనుకున్నంత సేవలందడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
ఉద్యోగము పొందేంత వరకే ఒక లక్ష్యం తో ఉంటారు. కాని ఆ తరువాత కాలంలో మంచి జీతం హోదా ఉన్నప్పటికీ ఏ గ్యారంటీ ఆదాయం లేని ఇతర జీవితాలతో పోల్చుకుని తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించలేక అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పాటైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలతో నిరంతరం ప్రజలకు పనిపడుతుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్ళి పరిశీలించినా 50% ఉద్యోగులు 10.30 గం కార్యాలయమునకు రారు. మధ్యాహ్నం 12-00 గంటల వరకు మెల్లి మెల్లిగా తమ సీట్లలో ఆశీనులై కనబడతారు. మళ్ళీ కాసేపట్లో భోజనవిరామం పేరుతో 3.30 గంటల వరకు తిరిగిరారు. అయితే సాయంత్రం 4.45 నిముషాలకే తమ తమ స్థానాలు ఖాళీ చేసి వెళతారు. దాదాపు కొన్ని శాఖలు మినహాయిస్తే తప్ప అన్ని శాఖలలో ఇదే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ఆ పని సమయం సరిపోక , ఏదో ఒక సాకుతో కొర్రీలు పెడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.
దాదాపు రాష్ట్ర బడ్జెట్ 40% వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు మరియు పెన్షన్‌లకు వెళుతుంది. మిగతా 60% అభివృద్ధి, అప్పుల అసలు వడ్డీలు, సంక్షేమ పథకాలకు కేటాయిస్తారు. ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని తమ చిన్న చిన్న పనుల కొరకు ప్రభుత్వ కార్యాలయమునకు వెళతారు. కాని అధికారులు సమయానికి అక్కడ అందుబాటులో ఉండక వెనుదిరిగి విసిగిపోతారు. తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి అధికారులు ఎం.ఎల్.ఏ లేదా ఎం.పి. లేదా రాజకీయనాయకుని సిఫారసు ఉంటే గాని పనులు చేయరు. ఒక సామాన్యుడు ఎం.ఎల్.ఏ లేదా ఎం.పి. లేదా ఒక రాజకీయ నాయకుడి దగ్గరకు వెళ్ళాలంటే ఒక చిన్న లీడర్‌ను పట్టుకొని వెళ్ళాలి. అదికూడ అధికార పార్టీకి చెందిన వారైతే తన పని అవుతుంది. లేదా అధికారపార్టీ కండువా కప్పుకోవాలి. ఈరోజు నాయకులు, అధికార పార్టీకి మారుతున్నవారు, ప్రజలు తమ కనీసహక్కుగా పొందే ప్రతి చిన్న సేవలను ఉద్యోగులు తాము చేయాల్సినవి కూడ అధికార పార్టీకి చెందిన రాజకీయనాయకుల సిఫారస్ కోరడమే అత్యంత బాధాకరం, దురదృష్టకరము. ఆత్మ గౌరవాన్ని చంపుకోవడం తప్ప మరోక మార్గం లేదు . ఒక పౌరుడు తనను పాలించే నాయకుడిని ఎన్నుకోవడంలో మన ప్రజాస్వామ్య పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థ సీక్రెట్ బ్యాలెట్‌ను పొందుపరిచింది. గెలిచిన నాయకుడు అందరినీ సమానంగా చూడాలని కల్పించిన విధానమే మనకు సీక్రెట్ ఓటింగ్ బ్యాలెట్ పద్ధతి.
ఒక వారములో ఒక ఉద్యోగి కనీస పనివేళలు 40-45 గంటలు ఆరు పనిదినాలలో పనిచేయాలి. అన్ని ప్రపంచ దేశాలలో ఇదే పద్ధతిని అవలంభిస్తున్నారు. అయితే ఈ పద్ధతిని ప్రభుత్వ అధికారులు అందరూ పాటిస్తే ప్రజలకు సేవలు నిర్విరామంగా అందజేయవచ్చును. పబ్లిక్ సర్వెంట్స్ అని పిలువబడే ఉన్నతాధికారులు సమయానికి కార్యాలయాలకు వస్తే చిన్న చిన్న అధికారులు కూడ సమయానికి వస్తారు. జిల్లా, మరియు మండల స్థాయిలో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు పనివేళలు సరిగా పాటించకపోవడం , జవాబుదారీతనం లోపించడం వలన ప్రజలకు సేవలు సరిగా అందడంలేదు. ఇటువంటి దుస్థితిలో ప్రజలు తమ నిత్య పనులకు ఆటంకం కలిగించుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో లంచాలు ఇచ్చి పని చేయించుకోవడం పరిపాటిగా మారిపోయింది .లంచం తీసుకోవడం, లంచం ఇవ్వడం సమాజము పై దుష్ప్రభావం చూపుతుందని, మన రాబోయే తరాల వారు మంచి సంకేతాలను పంపలేమని తెలుసుకున్నప్పడే అవినీతి నిరోధక శాఖ అవినీతి కట్టడికి చేసే ప్రయత్నాలు సాధ్యమౌవుతాయి.
ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్ బోర్డు వున్నప్పటికి దానికి చట్టబద్ధత లేకపోవడంతో పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. ఒక పౌరుడు తాను ఆశించిన పని ఎవరి సహాయం లేకుండానే సంబంధిత అధికారి పూర్తి చేసి తనను పంపించి ఉంటే ఎంతో ఆనందిస్తాడు . ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు తమ పనులు పూర్తి కాక తీవ్రమైన మానసిక సంఘర్షణ గురౌతున్నరన్న విషయం ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నేరుగా ఎంతో మందిని సంప్రదించి తెలుసుకుంది. సామాన్యులు ప్రశ్నించే శక్తి లేక ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఒక హిరో విలన్ పై తెర మీద చేస్తున్న ఫైట్లను చూసి మురిసి పోయి తమ అభిమానాన్ని ఆ హీరో పై చూపించడం వారిని ఆరాధించడం తమ నిత్య జీవితంలో కూడా ఇటువంటి హీరో వచ్చి తమకు సహాయం చేస్తారని ఆశిస్తూ తమ హీరోలను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ ఒత్తిడి చేస్తూ కాలయాపన చేసుకుంటూ ఎందరో యువకులు తమ భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నారు.
అధికారులలో అలసత్వం , అవనీతి, పక్షపాతదోరణి తాత్సారం పోవాలంటే, ఒక సమర్థవంతమైన బలమైన నాయకత్వ లక్షణాలు గల తాను ఆచరిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ వున్న నాయకులు మన ప్రస్తుత సమాజానికి అవసరం.
సోమ శ్రీనివాసరెడ్డి
కార్యదర్శి
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
ఓటుకు నోటు మరక
డా. పి. మోహన్ రావు,
విశ్రాంత ప్రొఫెసర్ & చైర్మన్ ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ
ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఏర్పరచుకున్న ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఓటర్లు ప్రముఖమైన పాత్రను పోషిస్తారు. ఏటా జనవరి 25 వ తేదిన భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. అర్హులైన ఓటర్లకు ఓటు హక్కు ప్రాముఖ్యాన్ని తెలియజేయడమే ఈ పండగ ఉద్ధేశం. ఈ సందర్భంగా అర్హులైన యువతీయువకులను ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదు చేయడం జరుగుతున్నది. 1988 వ సంవత్సరానికి ముందు 21 సంవత్సరాల వయస్సు వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఎక్కువ మంది యువకులను ఓటర్లుగా నమోదు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో వారికి పాత్రను కల్పించాలన్న సంకల్పంతో 1988 వ సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటర్ల వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. భారతదేశంలో ఎన్నికలు సజావుగా, పక్షపాత రహితంగా జరపడం కోసం 1950 వ సంవత్సరంలో జనవరి 25 వ తేదీన ఎన్నికల కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారత ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ బద్ధ సంస్థ. ప్రస్తుతం ఎన్నికల కమిషన్లో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉన్నారు. భారత ఎన్నికల కమిషన్ రాజ్యాంగ బద్ధమైన సంస్థ అయినప్పటికీ ప్రదాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నిక కమిషనర్ ల అర్హత ల గురించి, యోగ్యత గురించి వివరించలేదు. ప్రధాన ఎన్నికల కమిషనర్ను, కమిషనర్లు ను ఎంపిక చేసే కమిటీలో ప్రధాన మంత్రి, లోక్‌సభలో విపక్షనేత, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని 2023 మార్చి 2 వ తేదీన వెలువరించిన తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పుతో విభేదించి 2023 లో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లకు సంబంధించి చట్టం రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, ఒక కేంద్ర కేబినెట్ మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఉంటారు. ఈ విధమైన కమిటీ కూర్పు వల్ల ఎన్నికల కమిషన్ నియామకంలో ప్రభుత్వం మాటే చెల్లుబాటు అవుతుంది. ఎన్నికల కమిషన్ నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చి ఉంటే ఈ నియామకాలు పారదర్శకంగా జరగడానికి ఎక్కువ అవకాశం ఉండేది. ఎన్నికల కమిషన్ ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నియమించడం ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదమన్న అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు వ్యక్తపరుస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం లోని న్యాయ మంత్రిత్వ శాఖ ఓటర్లలో చైతన్యం తేవడం కోసం ప్రతి సంవత్సరం ఓటర్ల దినోత్సవం జరుపుకోవాలని సూచించింది. 2011 లో ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ఆమోదించి ప్రతి సంవత్సరం జనవరి 25 వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఓటర్ల దినోత్సవాన్ని తొలిసారిగా 2011 లో జరుపుకోవడం జరిగింది. 2025, జనవరి 25న భారతదేశంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లకు ఓటు ప్రాధాన్యాన్ని, విలువను తెలియజేయడం జరుగుతుంది. ఓటర్లు శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు భారత రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించింది. ఓటుహక్కును ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా సద్వినియోగం చేయాలి. దురదృష్టవశాత్తు ఈనాడు మన దేశంలో ప్రజాస్వామ్యం, ధనస్వామ్యంగా మారింది. అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు ఎరగా చూపి ఓట్లు వేయించుకుంటున్నారు. అన్ని ఎన్నికల్లో విచ్చలవిడిగా ఎన్నికల సంఘం సూచించిన దాని కంటే అనేక రెట్లు ఎక్కువగా ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఓటర్లు డబ్బు తీసుకుని ఓటు వేయడం వల్ల అసమర్థులు, అయోగ్యులు ఎన్నికై అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. ఎంతో మంది నేర చరితులు ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నారు. రాజకీయ పార్టీలు సమర్ధులైన అభ్యర్థులకు కాక, ధనబలం ఉన్న అభ్యర్థులకు మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. దురదృష్టవశాత్తు నేర సంబంధమైన అభియోగాలు ఎదుర్కొంటున్న శాసనసభ్యుల సంఖ్య పెరుగుతోంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రచురించిన సమాచారం ప్రకారం 2024 లో 18 వ లోక సభకు జరిగిన గెలుపొందిన 46% మంది అభ్యర్థులు క్రిమినల్ కేసుల్లో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఇందులో జాతీయ, పార్టీల అభ్యర్థులు, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు ఉన్నారు. మంచి ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఓటర్లు డబ్బుకో, మద్యానికో ఆశపడకుండా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సమర్ధులైన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలి. అప్పుడే సమర్థవంతమైన ప్రజాభీష్టమైన ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎన్నికల రోజున ఎన్నికలు జరిగే ప్రాంతంలో వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తారు. ఓటర్లు అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సెలవు ప్రకటించడం జరిగింది. ఎంతో మంది ఓటర్లు సెలవు ఇచ్చినా ఓటు హక్కును వినియోగించుకోవడంలేదు. గమనించాల్సిన విషయం ఏమిటంటే విద్యాధికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఓటింగ్ శాతం నమోదు తక్కువ అవుతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే నిర్బంధ ఓటింగ్ పెట్టాలి. ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటును నోటాకు ఓటు వేయాలి. ఎన్నికలు నిష్పక్షపాతంగా, వివాదరహితంగా నిర్వహించడంలో ఎన్నికల అధికారులు ప్రముఖ పాత్రను పోషిస్తారు. ఎన్నికలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించే అధికారులను గుర్తించి ప్రభుత్వం వారిని సత్కరిస్తుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దేశమంతటా ఓటుహక్కు ప్రాముఖ్యాన్ని తెలియజేయడం కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లు అందరూ విధిగా తమ ఓటును ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా సమర్థులైన అభ్యర్థులకే ఓటు వేసి మంచి అభ్యర్థులను ఎన్నుకుంటామని ప్రతిజ్ఞ చేయాలి. అప్పుడే ప్రజల చేత, ప్రజల కోసం ప్రజలు ఏర్పరచుకున్న ప్రభుత్వం ఏర్పడుతుంది.
Mohan Rao
CITIZEN'S SPEAK
RAZORS SHOULD ALWAYS BE FOR USE
There is an old proverb, ” Razors are for sale, but not for use”. It means that the razors are manufactured only for sale and do not serve the very purpose for which they are purchased. Interestingly, we often find and purchase too many such items which do not work for the purpose. But in that process, we fail to remember the basic fact that we hereby unknowingly encouraging the manufacturers that they can comfortably make huge profits by producing substandard products and dumping them in the market.
Our government invites investors across the globe claiming that ours is a wonderful place for their activity and we are committed to provide total infrastructure needed for them in that process. The intention of the government is no doubt laudable as foreign investments do help development of the country, provide employment to many and simultaneously lead to alleviation of poverty. But the problem comes when many a times same spirit is not shown in creating necessary facilities to the investors who plan to start their activity wholly relying on our assurances. In addition to the infrastructure, maintenance of congenial and peaceful atmosphere for their comfortable functioning carries utmost importance. Otherwise, our failure is sure to damage the prestige of the country in the eyes of international community.
Our government keeps on bringing out many enactments, guidelines, etc. for better functioning of the administrative system and to improve ease of doing things. In order to achieve the desired objects, necessary procedures and fail-safe systems are formulated while involving the citizens at the grass-root level and views of the concerned and the interested are elicited.
Our country also joins as a member-country in many international organisations for world-wide relations and sharing of information in respect of drug menace, greenhouse gases, prohibition of unrecyclable plastic wastes and other wastes, afforestation, child labour and many more complex matters plaguing, rather threatening the very survival of the mankind in the entire world. Many institutions are also created in furtherance of the desired goals. What is the use if the institutions so created formally function or do not function to the optimum level? Mere showcasing such things simply yields to burden to the exchequer. Fortunately, today a lot of information is downpouring into the country from all corners. There are many government agencies like intelligence wing, press, media, social organisations (NGO’s) which voluntarily and selflessly keep on alerting the government about the probable threats arising, undercurrents of the people concerned. There are many expert political leaders/ bureaucrats in the government who are meant to translate the governmental policies into realities. There are also special wings to monitor effective implementation of the government programmes at all levels. But the fact remains, ” All are vegetarians but the basket full of fish disappears”. Why then all the above factors are not contributing to efficient functioning of the government is a million dollar question.
Shyam Prasad
వర్షించని మేఘాలు
2001 లో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్ ఖాన్ నిర్మించిన లగాన్ సినిమాకు అశుతోష్ గోవారికర్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఒక సన్నివేశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అక్కడి ప్రాంత ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్న సమయంలో నల్లటి మేఘాలు కమ్ముకున్న తరుణంలో వర్షం పడుతుందని ఆ ప్రాంత ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే, ఏ మాత్రం వర్శించకుండానే ఆ మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడి ప్రజలు మేఘాలు వెళ్లి తెల్లని ఆకాశం కనిపిస్తున్న వాతావరణం చూసి ప్రజల్లో కలిగిన ఆశలు ఆనందం క్షణాల్లో ఆవిరి అయిపోతాయి. అక్కడి ప్రజలు తీవ్రంగా కోరుకున్నా వర్షం కరుణించలేదు , ఎందుకంటే అది వారి చేతుల్లో లేదు కాబట్టి నిరాశ తప్పదు.
అచ్చం ఇలాగే సినిమాలో మేఘాలు వచ్చి వెళ్లినట్టుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారిచ్చిన వాగ్దానాలతో ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఏదైనా లబ్ధి పొందవచ్చని కోట్ల సంఖ్యలో ఆశతో చూస్తూ ఉంటారు. ప్రభుత్వాలు ఎన్నికల్లోని హామీలను అరకొర అమలు చేస్తూ ప్రజల్ని భ్రమల్లో ఉంచుతున్నారు. ఇతరులకు కలిగిన అరకొర ప్రయోజనాలు చూసి మిగతా ప్రజలు మాక్కూడా వస్తాయని ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఏది పొందలేక అటు సొంతగా పనులు చేసుకుని అభివృద్ధి చెందలేక కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రజలు ఆధార్ కార్డు జిరాక్స్ లు మరియు కులం సర్టిఫికెట్స్ తో సిద్ధంగా ఉంటున్నారు . వారి అవసరాలకు తగ్గట్టు ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వాల వద్ద నిధులు లేవు. ప్రభుత్వాలు పన్నుల మీదా మాత్రమే ఆధారపడి పాలన చేస్తున్నాయి,ఆ డబ్బు సరిపోవడం లేదు,సంపద సృష్టించడం లేక , అప్పులు చేస్తున్నారు,ఆస్తులు అమ్ముతున్నారు.
రాజ్యాంగంలోనీ ఆదేశిక సూత్రాలలో అందరి అవసరాలు తీరేందుకు,తీర్చేందుకు పొందుపరచిన సామ్యవాద ఉత్పత్తి పంపిణీ విధానం ప్రకారం కాకుండా, రాజ్యాంగ విరుద్ధమైన పెట్టుబడి దారు ఉత్పత్తి పంపిణీ విధానం అమలు చేస్తూ,ప్రజలకు రాజ్యాంగ హక్కు అయిన విద్య, ఉపాధి , వైద్యం ,ఆరోగ్యం,గృహవసతి లాంటి అందకుండా చేస్తున్నారు.ప్రజలకు అవగాహన పెంచి, ప్రభుత్వాలను బాధ్యతగా నిలిపే సంస్కృతి పెంచాల్సిన అవసరం ఉంది.
Ashok MJ
FGG IN ACTION
FGG Submitting Representation on NOTA to State Election Commissioner Smt. I. Rani Kumudini
In 2013, the Supreme Court introduced the NOTA (None of the Above) option to increase voter participation. The Court’s intent was to ensure that voters who did not prefer any candidate could still cast their vote for NOTA. However, regardless of the number of votes NOTA receives, it currently does not impact election results.
In states like Maharashtra, Haryana, and Delhi, the respective State Election Commissions have strengthened the role of NOTA in local body elections by recognizing it as a “fictitious candidate.” As a result, if NOTA receives the highest number of votes, the elections must be conducted again.
In many districts of Telangana, Village Development Committees are auctioning Panchayat Sarpanch positions. If
NOTA is considered a fictitious candidate, elections must be held in all cases, leaving no room for uncontested selections.
To bring this issue to the attention of the authorities, members of the Forum for Good Governance—Shri M. Padmanabha Reddy (President), Shri Soma Srinivas Reddy (Secretary), and Shri Jillela Govardhan Reddy (Member)—submitted a representation to the Telangana State Election Commissioner, Smt. I. Rani Kumudini, on February 5, 2025.
Representations
FGG Submitted to various departments in the month of January 2025
- To the Chief Minister of Telangana regarding certain suggestions from FGG for implementation of Rythu Bharosa Scheme – on 3-1-2025
- To the Chief Minister of Telangana regarding serious irregularities committed by officials of Telangana State Industrial Infrastructure Corporation Limited (TSIIC). in allotment of land to M/s Raheja company, Enquiry conducted by Vigilance & Enforcement (V&E) department action on V&E report is pending since last 13 years – on 10-1-2025
- To the CEO, Food Safety and Standards Authority of India (FSSAI) regarding the ineffective implementation of the Food Safety Act in Telangana State, request for action – on 16-1-2025
- To the Commissioner, Health, Medical & Family Welfare (HM&FW) Department, Govt. of A.P. regarding urgent action required – extensive misuse of ethephon sachets, ethrel liquid and ethephon liquid in fruit ripening process – on 21-1-2025
- To the Spl. Chief Secretary, Health, Medical & Family Welfare (HM&FW) Department, Govt. of A.P. regarding urgent action required – extensive misuse of ethephon sachets, ethrel liquid and ethephon liquid in fruit ripening process – on 21-1-2025
- (Indiramma Houses), Serious irregularities in implementing the scheme from 2004 to 2014, C.I.D. inquiry ordered, no action taken so far – on 29-1-2025
- To the Chief Minister of A.P., regarding artificial ripening of fruits using dangerous chemicals, request for urgent action to prevent use of chemicals in ripening fruits – on 27-1-2025
- To the Minister of A.P., regarding artificial ripening of fruits using dangerous chemicals, request for urgent action to prevent use of chemicals in ripening fruits – on 27-1-2025
- To the Chief Minister of Telangana regarding Weaker Section Housing programme
Right to Information Act (RTI)
FGG submitted following RTI letters to various departments in the month of January 2025
- To the PIO, O/o Chief Secretary, Govt. of Telangana regarding action taken on our representation regarding abnormal delay in disposal of cases in MA & UD department – on 6-1-2025
- To the PIO, O/o Prl. Secretary, GAD regarding action taken on our representation regarding not taking action on Vigilance & Enforcement (V&E) reports in Government – on 6-1-2025
- To the PIO. O/o Commissioner, Vigilance Commission, regarding action taken on our earlier representation (6-4-2022) regarding Aasara Pensions Scheme – on 6-1-2025
- To the PIO, O/o Director General, Vigilance & Enforce Department, request for information on the action taken on our representation regarding fake Ag. B.Sc certificates – on 10-1-2025
- To the PIO, O/o Prl. Secretary, MA & UD Department, details requestd for information on current legal status of Layout Regularization Scheme (LRS) – on 10-1-2025
- To the PIO, O/o Chief Engineer, Hyderabad Road Development Corporation Limited, III Phase of works – details requested.- on 22-1-2025
- To the PIO, O/o TS Housing Corporation Limited, Regarding Indiramma Houses, Details of the implementation of the scheme between 2004 and 2014 requested – on 29-1-2025
- To the PIO, O/o TS Housing Corporation Limited, Regarding Rajiv Swagruha Scheme details and its implementation – on 29-1-2025
FGG TIMES
M. Padmanabha Reddy I.F.S.(R) (President)