FGG TIMES
సుపరిపాలనే ధ్యేయంగా
Vol. No. II | Issue No. 4 | Monthly News Letter | April 2026
IN FOCUS
Suggestion to Sub- Committee On Musi Rejuvenation Project
Forum for Good Governance a Civil Society Organization working for Government reforms would like to submit the following opinion.
Forum for Good Governance appreciates the move of the Government to rejuvenate river Musi, but without complete cleaning of the river other activities like constructions of Temple, Masjid, Gurudwara, Church etc. are planned which is objectionable. Hon’ble Chief Minister has actually laid foundation stone for a temple at Manchirevula on 29-3-2026, it is also planned to have 108 feet statue of Lord Shiva in the middle of Musi river. It is proposed to complete the work of ‘Omkareswara temple’ in 2 years.
In the year 2001 Water Board prepared a scheme – “Abetment of Pollution of river Musi” and submitted to Government of India which sanctioned the scheme. On the whole Rs. 405 crores were spent but desired results could not be achieved. Meanwhile GHMC took up construction of Rubber dam near High Court to control pollution at a cost of Rs. 50 crores. This also did not give any results and finally dismantled.
Again, in the year 2011 Water Board prepared yet another scheme – “Musi Phase II” with an estimated cost of Rs. 750 crores and sent to Government of India. The Government of India did not agree for the proposal and directed State Government to prepare an integrated and workable plan involving various agencies like Water Board, GHMC, HMDA, Horticulture, Pollution Control Board etc. Subsequently in the year 2012 fresh proposal was prepared for an amount of Rs. 17,130 crores to be executed by Water Board, GHMC and HMDA. The D.P.R. prepared was defective hence Government did not approve it.
In March 2017 Government constituted Musi River Front Development Corporation (MRDCL) to act as nodal agency for preparation and execution of comprehensive plan for abatement of pollution of river Musi. Since last 9 years no work was taken up by the MRDCL to clean up the Musi.
Due to encroachments Musi river significantly narrows resembling a big Nallah or Drain as it flows through the city. Due to inadequate water management system, untreated sewerage is regularly discharged into the river, transforming it into a heavily polluted water way. According to N.G.T. the river has been classified as a priority one polluted stretch. In the year 2015 Pollution Control Board identified Musi as one of India’s most polluted rivers. Many pharma companies and other industries discharge untreated waste into the river, introducing hazardous medical and chemical contaminants. The existing common effluent plants designed to handle these industrial pollutants have proven ineffective as a result Musi has suffered severe ecological damage, with pollution levels rendering the water toxic and unsuitable for sustaining aquatic life, agriculture or human life.
The problem of cleaning is a serious issue and may take long period to clean it. Under these circumstances without cleaning the river constructing places of worship is not justified. We feel erecting SHIVA statue in the middle of the polluted river is a SIN.
We feel Government is shifting priority from cleaning to rejuvenation, beautification et. Basically, Musi river in a dry stream from December to June. In the name of rejuvenation bring Godavari Water and letting it into Musi needs examination as steep gradient of the river the water in the stream will flow away quickly.
Keeping all these factors in view Forum for Good Governance requests the sub-committee to suggests to Government to take up cleaning of Musi as first priority.
M. Padmanabha Reddy
President
Forum for Good Governance
డి.జి.పి. తో ముఖాముఖి
తెలంగాణ డిజిపి (DGP) గారి పరిచయం రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీ బత్తుల శివధర్ రెడ్డి గారు హైదరాబాద్‌లో జన్మించినారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి LL.B. లో పట్టభద్రుడు అయ్యారు. కొంతకాలం న్యాయవాది గా ప్రాక్టీస్ చేసిన తర్వాత, 1994 సివిల్ సర్వీసెస్ పరీక్షలో అర్హత సాధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ఆయన తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడ్డారు. ప్రస్తుతం ఆయన తెలంగాణా ఇంటెలిజెన్స్ శాఖను నడిపిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిని నిర్వహిస్తున్నారు. దీని ముందు, వీరు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పదవుల్లో సేవలందించారు.
శ్రీ శివధర్ రెడ్డి గారు పోలీస్ విభాగానికి చెందిన ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, అవినీతి నిరోధం, సిబ్బంది నిర్వహణ మరియు పోలీస్ పరిపాలన ఉన్నాయి.
వీరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP)గా రెడ్డి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) చీఫ్ మరియు అదనపు డైరెక్టర్, యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB), ఆంధ్రప్రదేశ్‌గా పనిచేశారు.
విశాఖపట్టణం సిటీ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. 2014లో విశాఖపట్టణం పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో, రోడ్ల భద్రత కోసం “Arrive Alive” అనే ప్రచారాన్ని ప్రారంభించారు, ఇది ప్రజలలో సురక్షిత రోడ్డు అవగాహనను విస్తరించడంలో మరియు రోడ్ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడే లక్ష్యాన్ని సాధించింది. 2016లో ఆయన తెలంగాణలో పోలీస్ కోసం ఒక పబ్లిక్ కంప్లెయింట్స్ బాక్స్‌ను ప్రారంభించారు.
శ్రీ రెడ్డి గారు 2003లో ఐక్యరాజ్య సమితి అధ్వర్యంలో శాంతిస్థాపనలో (UNMIK) భాగంగా కొలువులో సేవలందించారు.
శ్రీ రెడ్డి గారు పలు అవార్డులతో సత్కరింపబడినారు. అందులో 2003లో ఐక్యరాజ్య సమితి అవార్డు, Police Gallentary Award (2002), Indian Police Medal (2011), The Asadharan Aasuchana Kushalta Padak for outstanding intelligence work (2018) మరియు President Police Medal for Distinguished Service (2020) ప్రముఖమైనవి.
శ్రీ శివధర్ రెడ్డి గారితో FGG ముఖాముఖిని చదవండి.
- తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి ?
- అత్యంత ప్రధానంగా బేసిక్ పోలీసింగ్ అమలు పరుస్తూ “కమ్యూనిటీ పోలీసింగ్ “ కాన్సెప్ట్ ద్వారా ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటున్నాము.
- ఈ ఫ్రెండ్లీ / కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చట్టాన్నిగౌరవిస్తూ చట్ట పరిధిలో నడుచుకునే వారికి మాత్రమే. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పొడుతున్న వారు నేరస్థులుగా పరిగణించబడతారు. కనుక వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. చట్ట ప్రకారం కఠినమైన చర్యలు కూడ తీసుకుంటున్నాము.
- మరోవైపు వివిధ చట్టాల పట్ల ప్రత్యేకించి సైబర్ నేరాల పట్ల, మత్తు పదార్థాల పట్ల, నార్కోటిక్స్ (NARCOTICS) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
- సోషల్ మీడియా ద్వార నేరుగా ప్రజలతో సత్సంబంధాలు సాగిస్తున్నాం.
- ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటుచేసాం
- కమ్యూనిటీ పోలీసింగ్ అంటే ఏమిటి ?
- కమ్యూనిటీ పోలీసింగ్ అంటే శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలను కూడా బాగస్తులను చేస్తూ ప్రతి పౌరుడు యూనిఫాం ధరించని పోలీసులే నని భావనలో, ప్రజలు మరియు పోలీసులు కలిసి సమాజ భద్రత కోసం పనిచేయడమే ఈ కమ్యూనిటీ పోలీసింగ్.
- సోషల్ మీడియా ద్వార పోలీస్ – ప్రజల మధ్య సంబంధం ఎలా మెరుగుపడుతుంది ?
- సాంకేతికాభివృద్ధి చెందిన నేటి సమాజంలో ప్రజలు అత్యధికంగా వినియోగిస్తున్న వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూ ట్యూబుల ద్వారా ప్రజలకు చేరువై వారికి పలురకాలుగా అవగాహన కలిగిస్తున్నాం. ఫిర్యాదులు స్వీకరించడం వాటికి తగిన విధంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
- ప్రజల సమస్యలకు త్వరితగతిని స్పందిస్తూ తగిన సహకారం అందిస్తున్నాం.
- పోలీసు స్టేషన్లలో ప్రజలు విశ్వాసంగా ఫిర్యాదు చేయగల వాతావరణం ఎలా సృష్టిస్తున్నారు ?
- పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రజలతో, భాదితులతో పోలీసులు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారి సమస్యను ఓపికతో వినేటట్లు చేస్తున్నాం.
- ఇందుకోసం ప్రతి పోలీసు స్టేషన్‌లో రిసెప్షన్ సెంటర్స్ ఏర్పాటు చేశాము.
- మహిళల కోసం ప్రత్యేక మహిళా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశాము.
- సి.సి. కెమెరా పర్యవేక్షణ, పారదర్శకంగా కేసుల విచారణ జరుపుతున్నాం.
- ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూ ఆర్ కోడ్ ద్వారా పోలీసుల పనితీరు పట్ల ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఈ మధ్యనే ఒక నూతన పద్ధతిని కూడా ప్రవేశపెట్టాం.
- ఫిర్యాదులపై ఫాలోఅప్ సిస్టమ్ కూడా ఉంది.
- సర్వీస్ ఓరియెంటెడ్ పోలీసింగ్ అనే భావనను మీరు ఎలా నిర్వచిస్తారు ?
- సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుంటున్నాము. ప్రజలకు సహాయకారిగా పోలీసు వ్యవస్థ సర్వీస్ ఓరియంటెడ్ పోలీసుగా రూపుదిద్దుకుంది. ప్రజలతో సహృద్భావంతో మెలుగుతూ, వారికి సమయానికి సహాయం అందిస్తున్నాము. సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తూ, భద్రతను కల్పిస్తున్నాము.
- ఎన్జీఓలతో కలిసి విద్య, వైద్యం వంటి విషయాలలో ప్రజలకు మా వంతుగా సహకారం అందిస్తున్నాం.
- ఆయా జిల్లాల యూనిట్లలో, పోలీస్ స్టేషన్ల పరిధిలో జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తున్నాం.
- పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెంపొందించేందుకు ఏ విధమైన సంస్కరణలు చేపట్టారు ?
- పిల్లలు, మహిళలు, వృద్ధులు సులభంగా తమ సమస్యలు చెప్పుకోగల వాతావరణం కల్పిస్తున్నాము.
- మహిళల రక్షణ కోసం Police Akka (పోలీస్ అక్క) Hawk Eye, She Teams, Bharosa Centres, T-SAFE వంటి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశాము.
- మహిళలపై వేధింపులను అరికట్టడంతో పాటు కౌన్సెలింగ్ మరియు న్యాయసహాయం కేంద్రాలను ఏర్పాటు చేశాము.
- ప్రతి కాలనీలో బీట్ సిస్టమ్, ప్రతి గ్రామంలో విలేజ్ పోలీస్ ద్వార ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాము. పోలీసులు వాహనాలలో కూర్చొని పెట్రోలింగ్ చేయడమే కాకుండా, కాలినడకన కూడా పెట్రోలింగ్ చేస్తూ ప్రజలతో ఆ ప్రాంతం యొక్క పోలీసింగ్ క్రైమ్ ల్యాండ్ ఆర్డర్ పరంగా మంచి చెడులను కూడా చూసుకుంటున్నాము.
- సైబర్‌క్రైమ్, మహిళా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ లాంటి అంశాలలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు ?
- వ్యక్తులను ప్రభావితం చేసే సైబర్ నేరాలు, నివారించ గలిగే నేరాలలో ముఖ్యమైనవిగా ఉంటాయి. సైబర్ నేరాలలో సుమారు 80% మొబైల్ ఫోన్‌ల ద్వార జరుగుతున్నందున, వ్యక్తిగత అప్రమత్తత అత్యంత అవసరం. చాలా సైబర్ నేరాలు సాంకేతిక హ్యాకింగ్ వల్ల కాకుండా, మనుషుల నమ్మకం, భయం లేదా అవగాహన లోపం కారణంగా జరుగుతున్నాయి. అందువల్ల సైబర్ నేరాలను నియంత్రించడంలో పౌరుల పాత్ర అత్యంతకీలకంగా మారుతుంది.
సైబర్ నేరాల్లో పౌరుడు లేదా బాధితుడు చేసే నిర్థిష్ట చర్యలు లేదా ప్రతి చర్యలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు OTP లు, పిన్లు లేదా పాస్వర్డ్‌లను పంచుకోవడం, తెలియని కాల్స్ స్పందిచండం, ఖాతా వివరాలను పంచుకోవడం లేదా ఆన్‌లైన్ లో నేరస్థులకు డబ్బు బదిలీ చేయడం వంటివి. అప్రమత్తంగా ఉన్న పౌరుడు, పోలీసుల జోక్యం అవసరం కాకముందే నేరాన్ని అడ్డుకోవచ్చు మరియు తనను తాను బాధితుడిగా మారకుండా రక్షించుకోవచ్చు. సురక్షిత డిజిటల్ అలవాట్లను పాటించడం ద్వార అనేక నేరాలను మొదటి దశలోనే అడ్డుకోవచ్చు.
పౌరులు మొదటి స్పందకులుగా ( ఫస్ట్ రెస్పాండెంట్స్ గా) కూడా వ్యవహరిస్తారు. గోల్డెన్ అవర్ సమయంలో 1930 కు కాల్ చేయడం లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయడం ద్వారా ఖాతాలను ఫ్రీజ్ చేయడం ద్వారా డబ్బు తిరిగి పొందే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. పౌరుల ఫిర్యాదుల ద్వారా ఏర్పడే, నమూనాల ఆధారంగా అనేక సంఘటిత సైబర్ నేర ముఠాలు (ఆర్గనైజ్డ్ సైబర్ క్రిమినల్స్ గ్యాంగ్స్) వెలుగులోకి వస్తాయి. సైబర్ భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. అది ఒక సామూహిక బాధ్యత, అవగాహనతో మరియు అప్రమత్తంగా ఉన్న పౌరులే సైబర్ నేరాలపై అత్యంత బలమైన రక్షణ గోడగా నిలుస్తారు.
మహిళల భద్రత
మహిళల భద్రత అనేది కేవలం ప్రభుత్వం మరియు చట్ట అమలు సంస్థల బాధ్యత మాత్రమే కాదు. ఇది సమాజమంతా కలిసి వహించాల్సిన బాధ్యత. సురక్షితమైన వాతావరణానికి పౌరులే పునాది.
- అప్రమత్తంగా మరియు ముందస్తుగా వ్యవహరించడం పౌరులు కేవలం ప్రేక్షకులు (బైస్టాండర్లు)గా ఉండకూడదు. ప్రజా ప్రదేశాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు, వేధింపులు, హింస, ఈవ్ టీజింగ్, వెంటాడడం (స్టాకింగ్), మానవ అక్రమ రవాణా లేదా దాడుల వంటి ఘటనలను గమనించి జోక్యం చేసుకోవాలి లేదా వెంటనే రిపోర్టు చేయాలి. సమూహస్థాయిలో ఉండే అప్రమత్తత నేరాలను నిరోధించే ప్రభావాన్ని కలిగిస్తుంది.
- అవగాహన పెంచడం మరియు ఇతరులను విద్యావంతులను చేయడం లింగ వివక్షపై ఆధారపడిన మూసపద్ధతులను ప్రశ్నించేలా, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించేలా, సమ్మతి (కన్సెంట్) మరియు సమానత్వంపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పౌరులు పాల్గొనవచ్చు లేదా వాటిని నిర్వహించవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్లు మరియు చట్టాల గురించి సమాచారం పంచుకోవడం ద్వార సమాజం శక్తిమంతమవుతుంది.
- బాధితులకు మద్ధతు ఇవ్వడం మరియు నేరాలను నివేదించడం బాధితులు ధైర్యంగా మాట్లాడేలా ప్రోత్సహించడం, వారి గోప్యతను కాపాడటం, బాధితులను వన్ స్టాప్ సెంటర్లకు (భరోసా) చేరుకునేలా సహాయం చేయడం, భావోద్వేగ మద్ధతును అందించడం మరియు ఫిర్యాదులు నమోదు. 305 చర్యలకు చేయడంలో సహకరించడం వేగవంతమైన కఠినమైన చర్యలకు దోహదపడుతుంది.
(లింగ వివక్షత)
- ఇల్లు మరియు కార్యాలయాల్లో లింగ సున్నితత్వాన్ని (Gender sensitivity) ప్రోత్సహించడం కూడా అత్యంత ముఖ్యం. చిన్న వయసు నుంచి ముఖ్యంగా అబ్బాయిలకు, ఆడవాళ్ళకు సమానమే అనే భావనను నేర్పించడం గౌరవ విలువలను నేర్పటం ద్వారా పురుషాధిక్య భావాలను తిరస్కరించి మహిళల హక్కుల పరిరక్షణకు మార్గం సుగమమవుతోంది.
- సమాజ ఆధారిత కార్యక్రమాల్లో పాల్గొనడం : తెలంగాణలో పౌరులు మహిళల భద్రత విభాగం చేపడుతున్న సేఫ్టీ క్లబ్బు, సేఫ్ మొబిలిటీ, మై సేఫ్ విలేజ్ వంటి కార్యక్రమాలతో కలిసి పనిచేసి, గ్రామస్థాయి నుంచి భద్రతను బలోపేతం చేయవచ్చు.
- ఆలోచనా విధానాలు మరియు సామాజిక ప్రమాణాలను మార్చడం కుటుంబాల్లో కార్యాలయాల్లో, ఆన్‌లైన్ వేదికలలో లింగ వివక్షతతో కూడిన జోకులు, బాధితులపై నింద మోపే ధోరణి మరియు మూస పద్ధతులను ప్రశ్నించడం ద్వారా మహిళలపై హింసకు పురికోల్పే వాతావరణాన్ని తగ్గించవచ్చు.
నిజమైన మహిళల భద్రత అనేది ప్రతి బాధ్యతాయుతమైన పౌరుడు ప్రతి చట్టాన్ని సమగ్రమైన, సురక్షితమైన వాతావరణాలుగా మార్చే సమాజంలోనే ఉద్భవిస్తుంది. మహిళల భద్రత కోసం ప్రేక్షకునిగా కాకుండా “అపెండర్”గా నిలబడటం ఇప్పటి అత్యవసరం.
ట్రాఫిక్ నియంత్రణలో పౌరుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. రోడ్డు భద్రత కేవలం పోలీసుల లేదా ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుడి రోజువారీ రోడ్డు ప్రవర్తన భద్రతపై నేరుగా ప్రభావం చూపుతుంది. ట్రాఫిక్ నిబంధనలు, వేగ పరిమితులు, సంకేతాలను పాటించడం ప్రమాదాలను తగ్గిస్తుంది. హెల్మెట్లు మరియు సీట్ బెల్టులు ధరించడం ప్రాణాలను కాపాడుతుంది. మద్యం సేవించి వాహనం నడపడం మరియు డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకాన్ని నివారించాలి. పాదచారులు మరియు సైకిల్ ప్రయాణీకులు కూడా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.
రోడ్డు పరిస్థితులు సురక్షితంగా లేకపోయినా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా అధికారులకు తెలియజేయాలి. తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే పిల్లలకు రోడ్డు భద్రత అలవాట్లు నేర్పాలి. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలకు పౌరులు మద్ధతు ఇవ్వాలి. బాట మర్యాదలను (road / traffic manners) ప్రతి ఒక్కరు సాగించాలి. ఇతర రోడ్డు వినియోగదారులను గౌరవించడం ద్వార క్రమశిక్షణ పెరుగుతుంది. పౌరులు బాధ్యతగా ప్రవర్తించినప్పుడు తెలంగాణలో రోడ్లు అందరికీ మరింత సురక్షితంగా మారతాయి.
- “ఫ్రెండ్లీ పోలీస్” కాన్సెప్ట్‌ను ప్రాక్టికల్ స్థాయిలో ఎలా అమలు చేస్తున్నారు ?
- చట్టాలను గౌరవిస్తూ చట్టపరిధిలో నడచుకునే వారిని గౌరవిస్తాము.
- చట్టాలను ఉల్లంఘించేవారిని నేరస్థులుగా పరిగణిస్తాము.
- Firm, Fair, Friendly and Professional పోలీసింగ్ అనేది మా పోలీసు విధానం.
- పోలీసులు కేవలం చట్టాలను అమలు చేసే వారిగానే కాకుండా, ప్రజల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే సేవకులుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో సివిల్ వివాదాలకు పోలీసులు దూరంగా ఉండాలి.
- ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను వినడం, పరిష్కరించడం, షీ టీమ్స్, భరోసా సెంటర్స్ ద్వారా మహిళలు, పిల్లల రక్షణకు కృషి చేస్తున్నాము.
- స్కూల్, కాలేజీ విద్యార్థులతో మీటింగ్‌లు, ఓపెన్ హౌస్‌లు, న్యాయ అవగాహన, సైబర్ సేఫ్టీ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నాము. ముఖ్యంగా ప్రజలు పోలీసులను నేరుగా కలిసి వారి సమస్యలను చెప్పుకోవాలని వివరిస్తున్నాం.
- పౌరసమాజం, వాలంటీర్లు, ఎన్జీఓలతో పోలీసులు ఎలా సమన్వయం చేసుకుంటున్నారు ?
- పోలీసు విభాగం ప్రజా భద్రత, సామాజిక శాంతి, నేరాల నివారణ వంటి లక్ష్యాల సాధనలో పౌరసమాజ సంస్థలు, వాలంటీర్లు మరియు ఎన్జీఓలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోంది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనేక సంస్థలు పోలీసులకి సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
- పోలీస్ సిబ్బందిలో ప్రజల పట్ల సేవా దృక్పథం పెంపొందించడానికి తీసుకుంటున్న ట్రైనింగ్ కార్యక్రమాలు ఏమిటి ?
- పోలీసులు కూడా ఈ సమాజంలో నుండి ప్రజల మధ్య నుండి వచ్చిన వారేనన్న విషయం విస్మరించకూడదు. పోలీస్ శాఖ శిక్షణా కార్యక్రమాల్లో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్‌లో భాగంగా ప్రజలతో మాట్లాడే తీరు, ఓపికగా ప్రజల సమస్యలు వినడం, పరిష్కారం వంటి నైపుణ్యాలపై శిక్షణ ఉంది. ప్రజలతో నిత్య సంబంధాలు, మానవ హక్కులను పరిరక్షిస్తూ, ప్రతి వ్యక్తిని గౌరవంగా, చట్టపరంగా వ్యవహరించాలనే కోణంలో శిక్షణ ఉంది.
- జెండర్ సెన్సిటైజేషన్ ద్వారా మహిళలు, పిల్లల పట్ల సున్నిత దృక్పథం కలిగి ఉండడం, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ & కౌన్సెలింగ్‌లో భాగంగా పోలీస్ సిబ్బంది మానసిక ఒత్తిడిని తగ్గించి తట్టుకునే విధంగా కరిక్యులం రూపొందించాం.
- ఎమర్జెన్సీ సర్వీసులు (Dial 100, Hawk Eye, Women Helpline మొదలైనవి) ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి ?
- ఎమర్జెన్నీ సర్వీసులు ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. Dial 100 ద్వార పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరి సహాయం చేస్తున్నారు. Hawk Eye యాప్ ద్వారా ప్రజలు సులభంగా ఫిర్యాదులు, ట్రాఫిక్ సమస్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి అంశాలను తెలియజేయగలుగుతున్నారు. మహిళల భద్రత కోసం ఉమెన్ హెల్ప్ లైన్ ( Dial 181) ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది.
- పోలీస్ ఇమేజ్ మెరుగుపడటానికి మీడియా పాత్రను మీరు ఎలా చూస్తున్నారు?
- పోలీస్ ఇమేజ్ మెరుగుపడడంలో సమాజంలో నాలుగవ పిల్లర్‌గా పరిగణించబడుతున్న మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీడియా సమాజానికి పోలీస్ సేవలను, ప్రజల భద్రత కోసం చేసే త్యాగాలను ప్రజలకు చేరవేస్తుంది. పోలీస్ వ్యవస్థలో ఉన్న మానవీయత, సేవా దృక్పథం, సామాజిక బాధ్యత వంటి అంశాలను వెలుగులోకి తెస్తుంది. మీడియా ద్వారా పోలీస్ శాఖలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం కూడా పెరుగుతుంది. అయితే మీడియా విమర్శనాత్మక పాత్ర కూడా అవసరం. పోలీసులు చేస్తున్న తప్పిదాలను చక్కదిద్దే దిశగా సూచనలు ఇవ్వడం ద్వారా వ్యవస్థ మరింత బలపడుతుంది. మీడియా పోలీస్ వ్యవస్థను ప్రజలకు దగ్గర చేయడంలో, పోలీసుల ప్రతిష్టను పెంచడంలో, ప్రజల విశ్వాసాన్ని బలపరచడంలో మీడియా ఒక వంతెనలా పనిచేస్తుంది.
- ప్రజా భద్రతను కాపాడడంలో కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాల ప్రాధాన్యం ఏమిటి ?
- ప్రజా భద్రతను కాపాడడంలో కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రజలలో చట్టాలు, నిబంధనలు మరియు భద్రతా చర్యల గురించి అవగాహన పెంచడం ద్వారా సమాజం సురక్షితంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి.
- కొత్త సాంకేతికత (CCTV, AI, డిజిటల్ రికార్డ్స్) వాడకం ప్రజల విశ్వాసం పెంపొందించడంలో ఎలా సహకరిస్తుంది ?
- కొత్త సాంకేతికతల వాడకం ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు CCTV కెమెరాలు నేరాలను అరికట్టడంలో, విచారణల్లో ఆధారాలుగా ఉపయోగపడుతాయి.
- AI ద్వారా నేరాల విశ్లేషణ, నియంత్రణ, ప్రమాదాల నివారణ జరుగుతుంది.
- డిజిటల్ రికార్డ్స్, వలన సమాచారం సులభంగా అందుబాటులోకి వస్తుంది. దీని వలన ఫిర్యాదుల పరిష్కారం వేగంగా జరుగుతుంది.
- రూరల్ (గ్రామీణ) ప్రాంతాల్లో ప్రజలతో పోలీస్ సంబంధాలు బలోపేతం చేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు ?
- గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో పోలీస్ సంబంధాలను బలోపేతం చేయడం కోసం పలు చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా గ్రామస్థాయిలో పోలీస్ అధికారులు ప్రజలతో నేరుగా మమేకం అయ్యేలా పోలీస్-పబ్లిక్ ఇంటరాక్షన్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అలాగే, మహిళల భద్రత కోసం “పోలీస్ అక్క”, “షీ టీమ్స్”, విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామ పంచాయితీ స్థాయిలో కమ్యూనిటీ పోలీసింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాము.
War Against War
The present burning subject for entire world is war and nothing but war, one between Russia and Ukraian and the other between IsraeI and Palestina which subsequently spread to Iran with USA in the backdrop. GENOCIDE (ending the lives of innocent children and women in particular) and MASSIVE DEVASTATIONS OF NATURAL RESOURCES, WONDERFUL DEVELOPMENTS MADE DURING THE LAST MANY YEARS AND DAMAGE TO THE WORLD INVIRONMENT in particular have become order of the day in those countries with little lesser effect in the neighbouring countries. Slowly the ill-effects of war started spreading to almost all countries in the world. Always the weakest are the worst sufferers. Above all, we all are one on the globe under the sky and we can in no way escape from ill-effects of war just because we are in a faraway country. It may be late but we too are sure to suffer in some proportion from the goings on. As a matter of fact, war-effects have already started affecting many countries. Let us no more be silent or indifferent or remain as helpless sufferers to these misdeeds continuing for months/years together.
We can understand well that these wars are intended only by some countable mad men but they conveniently made entire world community a party to them. We learnt some crores of years back the cave men/ the prehistoric human beings fought for fuel(fire). Unfortunately, even today we (whom we address as modern/ civilized men) are also fighting for owning the same fuel(gas) as one’s own property. It’s simply barbaric. On one side the world community joined in conventions/summits to minimise greenhouse gases and global warming and on the other side the same is inviting multiplication of those problems in the highest proportions. This is a GREAT IRONY indeed.
We must honestly admit the fact that in spite of wonderful developments/inventions that took place in the present world, we are still too weak to prevent natural acts of God viz., catastrophes like earthquakes, tsunamis, volcanic eruptions, heavy flash floods, tornadoes, wildfires, famines and sudden upsurge of pandemics like covid-19 and what not. Can we ever forget the nightmarish effect of covid-19? People somewhere in the world are always unfortunate victims of such disastrous things. Then why are we inviting man-made wars adding fuel to fire? Even innocent animals never enjoy such things.
Lastly, whatever the differences that arise among people or countries, entire mankind must come to unanimity on a single point that it is the high time to come out of their narrow barriers like caste, creed, race, religion, language etc. and cry with thundering voice in chorus that we, the peoples of entire world community, condemn wars/ use of weapons in any proportion. We neither support nor accuse anyone for being instrumental in initiating the war. We don’t even judge who is right or who is wrong in the war. WE ONLY PRAY ALL THE WARRING GROUPS TO END THE WAR RIGHT NOW only because it is not even the last resort to resolve our issues in the modern world. The fact is, as some great philosophers like Jiddu Krishna Murthy said, whether we hate or like the war, it does end on some day or the other. But by that time nothing remains to be seen or resolved. Even we don’t remain to see the massive devastations that took place on account of war.
We ourselves have created wonderful platforms to guide us and help in resolving all our issues. Confrontations never solved the issues in the past too and the single option left to all of us today is only friendly negotiations and nothing other than that.
We still remember that we last joined together when Anna Hajare went on fast. We again joined when Corona shook the entire world. Can’t we all join again and give birth to a mass movement to condemn the present ghostly war and openly declare our hatred towards it? The matter has already gained momentum in some countries/ places including few states of the very USA.
Let’s not lag behind in the matter and start raising our voice without losing even a minute more, hoping it turns into a mass movement in our state/country first and later involves all world countries as a single group.
There are classic examples in the history and in the recent years too where the mass movements led to many great changes.
మంత్రాలకు చింతకాయలు రాలక పోవచ్చు. కానీ, ఏమో, మన ప్రయత్నంతో యుద్ధం అగొచ్చేమో? ఒక ప్రయత్నం చేయలేమా? మనం ఆశవాదులంకదా!
Shyam Prasad
Member
Forum for Good Governance
న్యాయస్థానాల్లో సిటిజన్స్ చార్టర్ అవసరం
కక్షిదారులకు ఉచిత న్యాయ సేవలు, సహాయం అందుబాటులోకి తేవాలనే సదుద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలో సవరణలు చేసి న్యాయసేవల అధికారిక చట్టం, 1987 ని అమల్లోకి తీసుక వచ్చింది. ఈ చట్టాన్ని ప్రస్తుతానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, స్త్రీలు, చట్టంలో సూచించబడిన ఇతర బీద, బలహీన వర్గాల వారు ఉచిత న్యాయసేవలు, సహాయానికి అర్హులు. కేసు దాఖలు నుండి తీర్పు ప్రతులు పొందే వరకు అన్ని సేవలు వీరికి ఉచితంగా అందించబడతాయి. ఉచిత న్యాయ సేవలు, సహాయం గురించి దాదాపు ప్రతి కోర్టుల సముదాయంలో ప్రకటనలు, కరపత్రాలు మనం గమనిస్తూ ఉంటాం .
ఇదంతా ఒక పార్శ్వమయితే, సత్వర మరియు నాణ్యమైన న్యాయం కోసం కక్షిదారులు అర్రులు చాస్తున్నారనేది కాదనలేని నిజం. కేసు తుది అంకానికి చేరుకోడానికి సంవత్సరాలు గడిస్తే, వాదనలు విన్న పిదప తీర్పు వెలువరించడానికి కొన్ని నెలలు తీసుకుంటున్నారని, ఆపై తీర్పు లేదా ఉత్తర్వు ప్రతులు అందించటానికి కొన్ని వారాలు పడుతుందని, ఇన్ని అసౌకర్యాల మధ్య గెలిచినవాడు, ఓడినవాడు ఇరువురు అసంతృప్తితో ఉన్నారనేది కూడా నగ్న సత్యం.
సుప్రీంకోర్టు తమ తీర్పుల ద్వారా హైకోర్టు న్యాయమూర్తులకు తీర్పు వెలువరించటానికి గరిష్ట కాల పరిమితి విధిస్తూ చాలా సార్లు మార్గదర్శకాలు జారీ చేసింది. దిగువ కోర్టు న్యాయమూర్తులు తుది వాదనలు విన్న నాటినుండి సివిల్ కేసుల్లో 60 రోజులకు మించకుండా, క్రిమినల్ కేసుల్లో 45 రోజులకు మించకుండా తీర్పు లేదా ఉత్తర్వు వెలువరించాలని చట్టాలు చెబుతున్నాయి. అయితే ఈ నిబంధనలను కొంత మంది న్యాయమూర్తులు సక్రమంగా పాటించక పోవడంతో కక్షిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.
తీర్పులు ఒక నిర్దిష్ట సమయంలో వెలువరించాలనే సుప్రీం కోర్టు తీర్పులు, సంబంధిత చట్టాలు చెబుతున్నాయనే విషయం చాలా మంది సాధారణ ప్రజానీకానికి తెలియదు. నిర్ణీత సమయంలో తీర్పు వెలువరించనట్లయితే సంబంధిత న్యాయమూర్తిని ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారం అవుతుందేమో లేక తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందేమో అనే జంకు సహజంగా కక్షిదారుల్లో ఉంటుంది. ఇటువంటి అపోహను తొలగించి కక్షిదారులకు న్యాయస్థానాలపై నమ్మకం, మరింత గౌరవం పెరగాలంటే, న్యాయస్థానాల్లో పారదర్శకత, జవాబుదారీ విధానాన్ని కల్పించాలంటే ప్రస్తుత పరిస్థితుల కనుగుణంగా ఉన్నత న్యాయ వ్యవస్థ కొన్ని చర్యలు సత్వరమే చేపట్టవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా పౌర సేవలు అందించే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నట్లు సిటిజన్స్ చార్టర్ న్యాయస్థానాల్లో కూడా కీలక మైన పాత్రను పోషిస్తుంది. అంటే ఇది సేవల ప్రమాణాలు మరియు కాలపరిమితులకు సంబంధించిన విధానాలను నిర్దేశిస్తుంది.
సివిల్ దావా, అప్పీలు దావా, క్రిమినల్ కేసుల్లో చార్జి షీటు, ప్రైవేటు ఫిర్యాదు, క్రిమినల్ అప్పీలు మొదలగు వాటిని దాఖలు చేసిన నాటి నుండి కోర్టులు రిజిస్ట్రేషన్ కు తీసుకునే గరిష్ట కాలపరిమితి; తీర్పు లేదా ఉత్తర్వు వెలువరించటానికి హైకోర్టుకు సుప్రీంకోర్టు నిర్దేశించిన గరిష్ట కాలపరిమితి; దిగువ కోర్టులకు తీర్పులు వెలువరించటానికి చట్టాలు నిర్దేశించిన నిర్దిష్ట కాలపరిమితి; ఉచిత తీర్పు ప్రతులు జారీ చేయడానికి గరిష్ట కాలపరిమితి; డాక్యుమెంట్లు, ఇతర ఉత్తర్వుల నఖళ్ళు ఖర్చులతో జారీ చేయటానికి తీసుకునే గరిష్ట కాలపరిమితి తెలియజేసే ఒక నియమావళిని బహిర్గతం చేస్తూ పారదర్శకత కోసం హైకోర్టు మరియు దిగువ కోర్టుల్లో ప్రస్ఫుటంగా అందరికీ కనిపించే ప్రదేశంలో సిటిజన్స్ చార్టర్ లాంటి కాలపట్టిక ప్రదర్శించాలి. అదే రీతిలో ప్రతి కోర్టులో పెండింగులో ఉన్నటువంటి కేసుల సంఖ్య, పరిష్కరించబడినటువంటి కేసుల సంఖ్య, కేటగరీ వారీగా, సంవత్సరం వారీగా ప్రతి మూడు లేదా ఆరు నెలలకోసారి ప్రదర్శించాలి. దాని వల్ల పాత మరియు క్రొత్త కేసుల సంఖ్యా వివరాలు, న్యాయవాదులకు, కక్షిదారులకు తెలియడమే కాకుండా పాత కేసుల పరిష్కారానికి కోర్టు ప్రాధాన్యత నిస్తుందనే విషయం వారికి బోధపడ్తుంది. అంతే కాకుండా భవిష్యత్తులో కక్షిదారులకు సకాలంలో నాణ్యమైన సేవలు అందించే సంస్కరణలు రూపు దిద్దుకునే అవకాశం లేకపోలేదు. ఎప్పుడైతే కక్షిదారులకు నిబంధనల గురించి పరిజ్ఞానం ఉంటుందో, న్యాయస్థానాలు కూడా జవాబుదారీ తనంతో వ్యవహరిస్తాయి. ఈ కార్యానికి సంబంధిత కోర్టు చర్యలు తీసుకునే విధంగా ఉన్నత న్యాయస్థానాలు మార్గదర్శకాలు జారీ చేయాలి.
తడకమళ్ళ మురళీధర్
విశ్రాంత జిల్లా జడ్జి
The Two-seat Insurance Policy
Actor-turned-politician Joseph Vijay says he wants to bring clean politics and not misuse public funds. A noble promise. One hopes he will begin by ensuring that his own political strategy does not impose avoidable costs on the public exchequer.
Contesting from two constituencies has become the political equivalent of an insurance policy. It is rarely done by leaders who are confident of victory. It is the preferred route of those who want a safety net.
The chief of the Tamizhaga Vetri Kazhagam (TVK) will be contesting from two constituencies – Perambur and Tiruchirapalli East – in the 2026 Tamil Nadu Assembly election, in his poll debut.
By-poll forced upon voters
Rahul Gandhi contested from Rae Bareli in Uttar Pradesh and Wayanad in Kerala – two entirely different states, separated by distance, language and political context – but represented by one candidate. The objective was clear: hedge the risk. After winning both, one seat is vacated, and a by-election is forced upon the voters.
This is not new. Narendra Modi contested from Varanasi and Vadodara in 2014, and later vacated Vadodara, triggering a by-election. Over the years, leaders such as Mulayam Singh Yadav and Lalu Prasad Yadav have followed the same script. Contest two seats, win both, keep one, resign the other – and leave the rest to the Election Commission and the taxpayer.
It costs money
An election is not a symbolic exercise. It involves thousands of polling staff, deployment of security forces, transport, EVM management, training, and an elaborate administrative machinery. All these costs crores of rupees. When a candidate vacates a seat, the entire process must be repeated – not because the electorate asked for it, but because a politician wanted a fallback option.
The candidate loses nothing. The voter is inconvenienced. The state spends again. Democracy becomes more expensive, not more representative.
Let them pay for it
There is a simple reform that can end this overnight. If a candidate contests from two seats and later resigns one, the full cost of the by-election in that constituency should be recovered from the candidate or the party.
If leaders want a two-seat insurance policy, they should pay the premium themselves – not pass the bill to the public.
Until then, this will remain what it is: risk-free politics for the candidate, and risk-full expenditure for the taxpayer.
If leaders want a safety net, they should knit it with their own money.
Nagarjuna Rao
Courtesy Orange News9
ప్రజల కన్నీళ్లపై విగ్రహాలు కడతారా?
హైదరాబాద్ నగర చరిత్రకు, సంస్కృతికి, సామాన్యుల జీవన విధానానికి మూసి నది ఓ మౌన సాక్షి. ఇప్పుడు ‘సుందరీకరణ’ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ నదిని మళ్లీ ప్రజా చర్చల కేంద్రంగా నిలిపాయి.. అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ప్రణాళికలు నిజంగా నగర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయా? లేక నదీ తీరాల్లో నివసిస్తున్న ప్రజల జీవితాలపై అనిశ్చితి మేఘాలు కమ్మేస్తున్నాయా?
మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు నిజంగా అభివృద్ధి సంకల్పానికి నిదర్శనమా? లేక సామాన్య ప్రజల జీవితాలపై పడుతున్న భారమా? లంగర్ హౌస్ పరిసరాల్లో, బాపు ఘాట్ సమీపంలోని ‘మధు పార్క్ రిడ్జ్’ నివాసితుల ఆవేదన ఈ ప్రశ్నలను మరింత తీవ్రంగా నిలబెడుతోంది.
ఇది ప్రజాస్వామ్య పద్ధతేనా?
ప్రభుత్వ అనుమతులతో, అధికారుల ఆమోదాలతో, పన్నులు చెల్లిస్తూ, విద్యుత్–నీటి కనెక్షన్లు పొందుతూ నిర్మించుకున్న గృహాలు ఒక్కసారిగా ‘బఫర్ జోన్’ పేరుతో అక్రమాలుగా మారిపోవడం ప్రజల్లో అయోమయం, ఆగ్రహం కలిగిస్తోంది. అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం.. పన్నులు వసూలు చేసింది ప్రభుత్వం, ఇప్పుడు అక్రమమని ప్రకటించేది కూడా అదే ప్రభుత్వం. పరిపాలనా వైఫల్యానికి బాధ్యత ఎవరూ వహించకుండానే బుల్డోజర్లు ముందుకు సాగితే, అది ప్రజాస్వామ్య పద్ధతేనా? రిటైర్మెంట్ అనంతరం జీవితకాల పొదుపుతో ఫ్లాట్ కొనుగోలు చేసిన వృద్ధ దంపతులకు అది కేవలం ఆస్తి కాదు- ఆశ్రయం, భద్రత, భావోద్వేగ బంధం. ‘బుల్డోజర్ పైనుంచి పోయినా పోము’ అనే వారి మాటల్లో చట్ట విరోధ ధోరణి లేదు. జీవన హక్కుపై ఉన్న ఆత్మగౌరవమే ఉంది. అభివృద్ధి పేరుతో మనుషుల మనోభంగం కలిగితే, ఆ అభివృద్ధి ఎంతవరకు సమగ్రం?
గాంధీ తత్వాన్ని మరవకూడదు!
నది సుందరీకరణ అవసరం లేదని ఎవరూ చెప్పడం లేదు.. నగరాల అభివృద్ధిలో నదుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వడం సముచితం. కానీ అసలు సుందరీకరణ అంటే ఏమిటి? ముందుగా నదిలో కలుస్తున్న మురుగు నీటిని అడ్డుకోవాలి. శుద్ధి కేంద్రాలను బలోపేతం చేయాలి. వరద ముప్పును శాస్త్రీయంగా అంచనా వేసి, దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి. కానీ నది ఒడ్డులను పూర్తిగా కాంక్రీట్‌తో కప్పేయడం వల్ల సహజ ప్రవాహాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రకృతి సహజత్వాన్ని కాపాడకుండా సుందరీకరణ సాధ్యం కాదు. ఈ సందర్భంలో తరచూ ప్రస్తావనకు వచ్చే పేరు మహాత్మా గాంధీ. ఆయన స్ఫూర్తి విగ్రహాల ఎత్తులో కాదు.. విలువల లోతులో ఉంది. పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, మానవ గౌరవం ఇవే గాంధీ తత్వం. జీవం లేని విగ్రహాల కంటే జీవించే మనుషుల జీవితాలే ముఖ్యమని ఆయన ఆచరణలో చూపించారు. గాంధీ పేరుతో ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు, గాంధీ తత్వాన్ని మరవకూడదు.
హక్కు ఉంటే ఏమైనా చేస్తారా?
‘మా బతుకులను ఆగం చేసి, ఎవరికోసం ఈ అభివృద్ధి? వేరే చోట ఇలాంటి ఇల్లు ఇస్తారని నమ్మకం ఏంటి? ₹4,000 పెన్షన్ ఇస్తామన్నారు.. ఇచ్చారా? మహిళలకు ₹2,500 ఇస్తామని అన్నారు ఒక్కరికైనా అందిందా?” అని ఒక వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నిజమే ఈ ప్రశ్నలు కేవలం వ్యక్తిగత బాధ కాదు.. పాలనపై ఉన్న అనిశ్చితికి ప్రతిబింబం. ప్రభుత్వానికి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టే హక్కు ఉన్నంత మాత్రాన, ప్రజలతో సంభాషణ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదు. ప్రజల ఆమోదం, పారదర్శకత, న్యాయబద్ధత ఇవే మంచి పాలనకు పునాదులు.. అనుమతులు ఇచ్చిన అధికారుల బాధ్యతను నిర్ధారించకుండా కేవలం నివాసితులపై చర్యలు తీసుకోవడం అసమానతను పెంచుతుంది.
నది శుద్ధి నుండి ప్రారంభించాలి!
పునరావాసం స్పష్టమైన ప్రణాళికతో, సమయపాలనతో, మార్కెట్ విలువకు సరిపడ పరిహారంతో ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల విద్య, ఆరోగ్య అవసరాలను సున్నితంగా పరిగణించాలి. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భాన్ని పక్కనబెట్టినా, ప్రజల విశ్వాసం కోల్పోవడం ఏ ప్రభుత్వానికీ మేలు చేయదు.. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి బలవంతపు ప్రకటన కాదు.. అది పరస్పర నమ్మకంపై నిలిచే ఒప్పందం. మూసీ సుందరీకరణ నిజంగా అవసరమైతే, అది నది శుద్ధి నుంచి ప్రారంభమవ్వాలి. కానీ ప్రజల గృహాల కూల్చివేతలతో కాదు. అభివృద్ధి అంటే కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదు.. మనుషుల గౌరవం, భద్రత, భవిష్యత్తుపై నమ్మకం. ప్రభుత్వం గనక నిజంగా సుందరీకరణ కోరుకుంటే, ముందుగా ప్రజల హృదయాలను గెలుచుకోవాలి. కన్నీళ్లపై కట్టిన నిర్మాణాలు శాశ్వతంగా నిలవవు. ప్రజల విశ్వాసంపై నిలిచిన నిర్ణయాలే చరిత్రలో నిలుస్తాయి.
సయ్యద్ రఫీ
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు
FGG IN NEWS
FGG IN ACTION
FGG Submitted representations to various departments in the month of MARCH 2026
- To the Chief Minister regarding Large number of ineligible families drawing white rice free of cost Heavy burden on exchequer. Request to examine the issue and weed out ineligible families – on 23-3-2026
- To the Chief Minister regarding Vigilance & Enforcement department not taking action on V&E reports in Secretariat. Request to instruct Chief Secretary to take action on V&E reports – on 28-3-2026
FGG submitted following RTI letters to various departments in the month of MARCH 2026
- To the PIO, O/o District Prohibition & Excise Officer, Nalgonda regarding availability of Toddy in Nalgonda – on 28-3-2026
- To the PIO, O/o Spl.. Chief Secretary, ITE&C, I&C, GAD departments, regarding delegation visiting World Economic Forum at DAVOS, Switzerland — on 30-3-2026
FGG TIMES
Forum For Good Governance
H.No.6-1-69, Flat No.204,
G.K.R. Mansion Saifabad,
Lakdikapool, Hyderabad,
Pin : 500004
Phone: 040 2323 0334
Editorial Board:
M. Padmanabha Reddy I.F.S.(R) (President)
Soma Srinivas Reddy B.E (Secretary)
Interested may send articles/ letters/ News to
E-mail: timesfgg@gmail.com