FGG TIMES
సుపరిపాలనే ధ్యేయంగా
Vol. No. II | Issue No. 1 | Monthly News Letter | January 2026
IN FOCUS
పంచాయితీలను బలోపేతం చేయాలి
రెండు సంవత్సరాల సుదీర్ఘ ఎదురుచూపుల తరువాత డిసెంబర్ నెలలో గ్రామపంచాయితీల ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు పార్టీ రహితంగా జరగాలని ఉన్నా అలా కాలేదు. సుమారు 1200 గ్రామ పంచాయితీలలో ఏకగ్రీవ ఎన్నిక జరుగగా వీటిలో చాలామటుకు సర్పంచ్ పదవికి వేలం వేయడం జరిగింది. సుమారు రూ// 20 లక్షల నుంచి రూ// 50 లక్షల వరకు పాట పాడి వేలంలో పదవి దక్కించుకున్నారు. రెండు ప్రధాన పార్టీలు ఓటుకు వేయి నుంచి ఐదు వేల వరకు బాహాటంగా పంచినారు. ఇక మద్యం, చీరెలు, ఉంగరాలు ఇలా రకరకాలుగా ప్రలోభాలతో ఓటరును ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. ఇంత జరుగుతున్నా ఎన్నికల యంత్రాంగం కళ్ళు మూసుకుంది. అక్కడక్కడ కోడు ఉల్లంఘన అంటూ కేసులు నమోదు చేసినారు, కాని డబ్బులు ఇతర ప్రలోభాలను ఎన్నికల సంఘం ఆపలేకపోయింది. ఎన్నికలు ఫ్రీ (Free) గా జరిగినా ఫెయిర్ (Fair) గా మాత్రము జరుగలేదు. దీనితో ఓటు అమ్ముకొనడం అన్న ఒక దుష్ట సంప్రదాయం ఏర్పడింది. కొత్తగా ఎంపికైన సర్పంచులలో కొద్ది మంది తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఇంకా కొందరు సర్పంచ్‌లు గెలవడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టినారు. కొన్ని గ్రామాలలో రూ// 25 లక్షల వరకు ఖర్చు అయితే ఇంకా కొన్ని గ్రామాలలో రూ// 60 లక్షల వరకు ఖర్చు చేసి, ఇదంతా ఒక పెట్టుబడిగా భావించి వచ్చే 5 సంవత్సరాలలో ఈ పెట్టుబడికి రెండింతలు సంపాదించాలనే కోరికతో ఉన్నారు. గ్రామప్రజలు మరియు అధికారుల నిఘా లేనట్లయితే పంచాయితీకి వచ్చే నిధులలో సింహభాగం సర్పంచ్ జేబులోనికి పోయే ప్రమాదముంది.
భారత రాజ్యాంగం అనుకరణ (ఆర్టికల్) 243 – G ప్రకారం గ్రామాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా ఉండాలి. పదకొండవ షెడ్యూల్ లో సూచించిన ప్రకారంగా 29 అంశాలు ముఖ్యంగా వ్యవసాయం, చిన్న నీటి పారుదల, పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖ, కుటీర పరిశ్రమలు, గ్రామీణ గృహనిర్మాణము, త్రాగునీరు, మార్కెట్‌లు, డ్రైనేజీ వంటి అంశాలు గ్రామపంచాయితీల పరిధిలోనికి వస్తాయి, అయితే ఇట్టి 29 అంశాల పనులు రాష్ట్రప్రభుత్వం గ్రామపంచాయితీలకు బదలాయించాలి, కాని ఇంతవరకు పూర్తిగా బదలాయింపు కాలేదు. అలాగే గ్రామాభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలతో గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారై అట్టి అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ ముందుంచి గ్రామసభ మంజూరి తరువాత అవే పనులు చేపట్టాలి. సర్పంచ్ కాని ఇతర అధికారులు కాని ప్రణాళికలో లేని పనులు మొదలుపెట్టరాదు. గత ప్రభుత్వ హయాంలో చాలామంది సర్పంచ్‌లు బడ్జెట్ లేకున్నా గ్రామంలో పనులు తమ స్వంత డబ్బుతో చేయించి చివరకు నిధులు విడుదల కాక తీవ్ర ఇబ్బందులకు గురైనారు.
ఎన్నికలు అయినాయి కాబట్టి కేంద్రం నుంచి (15వ ఆర్థికసంఘం) నిధులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. అవి ఇంతలో అనుకున్నట్లు రాకపోవచ్చు. అదేకాక ఒకే విడతలో కూడ రాకపోవచ్చు. ఇకపోతే రాష్ట్రం నుంచి పంచాయితీలకు విడుదల చేయవలసిన నిధులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. రాజ్యాంగం అనుకరణ 243 – I ప్రకారము ప్రతి రాష్ట్రానికి కేంద్రంలో మాదిరిగానే రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ ఉంటుంది. ఈ రాష్ట్ర ఆర్థిక కమీషన్ వారు రాష్ట్రంలో వచ్చే పన్నులను రాష్ట్రానికి, గ్రామ పంచాయితీలకు పంచడానికి సూచనలు చేస్తారు. అలాగే గ్రామ పంచాయితీల ఆర్థిక స్థోమత పెంచుటకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పంచాయితీలకు గ్రాంట్ – ఇన్ – ఎయిడ్ క్రింద నిధుల విడుదలకై రికమెండ్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి ప్రభుత్వం రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ ఏర్పాటు చేయలేదు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టు లో పిల్ వేయడం కోర్టు వారి ఆర్డర్ ద్వార తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక కమీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత పది సంవత్సరాలలో కమీషన్ వారు చేసిన రికమండేషన్‌లు ఎవరికీ తెలియదు. ఇప్పటికైనా కమీషన్ వారు పంచాయితీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఫైనాన్స్ కమీషన్ లాగ రాష్ట్ర నిధుల నుంచి 40% నిధులు గ్రామ పంచాయితీలకు విడుదల చేయడానికి రికమండ్ చేయాలి. ఇచ్చట గమనించవలసిన విషయమేమిటంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయితీలకు రాజ్యాంగ ప్రకారము ఒక హక్కుగా రావాలే కాని రాష్ట్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాల పైన కాదు.
గ్రామ పంచాయితీలు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు కావాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టవలసి ఉంటుంది.
- సర్పంచ్‌లకు జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాలు. ఇందుకు ప్రతిజిల్లాలో నుంచి సంబంధిత అధికారులకు ఎన్.ఐ.ఆర్.డి.(NIRD) లో శిక్షణ ఇచ్చి వారు తిరిగి జిల్లాలలో సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమం చేపట్టాలి. ఇందులో సర్పంచ్‌ల అధికారాలు, భాద్యతలు, గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారు, సామాజిక న్యాయం వంటివి ఉండాలి.
- గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారుపై శిక్షణ అలాగే అట్టి ప్రణాళికను గ్రామసభ ముందుంచి గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. గ్రామసభకు మండల / జిల్లా స్థాయి అధికారులు హాజరై తగు సూచనలు, సలహాలు ఇవ్వాలి.
- మండలస్థాయి అధికారులు అభివృద్ధి ప్రణాళికలో సూచించిన పనులకు ఎస్టిమేట్‌లు చేసి పనుల ఆవశ్యకతను బట్టి 5 సంవత్సరములలో సంవత్సర వారీగా తీసుకోవాల్సిన పనులు మరియు వాటికి కావలసిన బడ్జెట్ అందులో పొందుపరచాలి.
- ప్రణాళికలో లేని పనులను తీసుకోరాదు. అలాగే చేపట్టే పనులకు కావలసిన ఎస్టిమేట్ వంటివి పారదర్శకంగా ఉండాలి.
- కేరళ రాష్ట్రంలో పంచాయితీ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. మన రాష్ట్రం నుంచి అధికారులు అలాగే కొందరు సర్పంచులను ఆ రాష్ట్రానికి పంపి అచ్చట అమలవుతున్న పద్ధతులను అవగాహన చేసుకోవాలి.
- మహిళా సర్పంచులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టి వారిలో ఆత్మస్థైర్యం నింపాలి. మహిళా సర్పంచ్‌ల భర్తలు కాని, తండ్రి కాని ఎవరూ కూడ పంచాయితీ మీటింగులకు రాకూడదు. అలాగే పనులలో జోక్యం కలిగించుకొనకుండా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలి.
- సంక్షేమ పథకాలలో లబ్ధిదారుల ఎంపిక పంచాయితీలు చేసి గ్రామసభ ముందుంచి అనుమతి తీసుకోవాలి. దీనిలో శాసనసభ్యుల ప్రమేయం ఉండకూడదు.
యం. పద్మనాభరెడ్డి
అధ్యక్షులు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
The Alchemy of CURE, PURE, and RARE: Turning Slogans into a City
Telangana today speaks the language of confidence, sometimes even before its morning tea. The Telangana Vision Document reflects this bravado—global city dreams, a trillion-dollar economy, and Hyderabad projected as a peer of world capitals. Ambition is not the problem; unquestioned ambition is. The CURE–PURE–RARE vision is rhetorically attractive but conceptually weak and operationally vague. All three words revolve around the ‘economy’, completely ignoring society. Acronym-driven branding replaces clear definitions, metrics, and accountability. Despite claims of polycentric growth, development remains Primate city, Hyderabad-centric. Infrastructure-led equity is overstated, agrarian distress ignored, and peri-urban manufacturing risks dispossession and ecological stress. Markets substitute for public purpose, reducing society to an afterthought. Economic growth, detached from social development, becomes hollow.
The City That Ate the Countryside
Rural Telangana is not an unfinished city awaiting software updates. It is a living system shaped by land, tanks, crops, seasons, and social ties. Applying the logic of HITEC City to Medak or Mahabubnagar does not modernise these regions; it hollows them out. Land prices rise briskly, groundwater falls quietly, livelihoods weaken without alternatives, and migration accelerates. Development becomes a polite word for extraction.
Hyderabad(CURE) is projected as the engine of growth; the rest of the state, specially RARE zone is cast as its support system—supplying land, labour, food, and increasingly, water. The Outer Ring Road, and soon the RRR, have become invisible planning borders. Inside them, infrastructure multiplies. Outside them, borewells dry up, tanks silt over, and public services thin out. Growth is celebrated—but its geography is selective.
Big Numbers, Small Questions
The trillion-dollar dream seems impressive, but large numbers have a peculiar talent: they replace hard thinking. Albert Hirschman once warned against the “rhetoric of the big push,” where scale substitutes for sequencing, trade-offs, and realism. Telangana’s growth narrative displays similar confidence—that expansion will be smooth, linear, and politically neutral. It will not.
Climate stress alone should temper this optimism. Agriculture already struggles with erratic rainfall, degraded tanks, and groundwater depletion. Hyderabad’s water crisis is no longer theoretical; it arrives every summer in tankers, emergency pipelines, and anxious press briefings. Yet vision documents speak of uninterrupted growth, as though hydrology were an optional constraint. Many localities still lack continuous drinking water. Nature, unfortunately, does not read policy papers.
CURE: The Corporate Campus City
Hyderabad itself is increasingly planned like a corporate campus—efficient, enclosed, monitored, controlled. “Smart city” language dominates: neon lights, sensors, command centres and of course Pubs, Golf courses for the rich. But cities are not start-ups, and citizens are not users. A city must be judged by inclusion, not interface.
Informal habitations are cleared faster than they are rehabilitated. Affordable housing for lower and middle classes moves from one document to another without any realised goals. However, Gated enclaves proliferate with spreadsheet efficiency, while informal livelihoods—street vendors, service workers, small traders—are treated as encroachments rather than economic lifelines.
A successful Hyderabad(CURE) would be measured not by glass towers, but by access to affordable housing, ease of transportation, sanitation, dignified work and social equity. A socially and economically just city matters more than a smart one.
Lakes, Layouts, and Convenient Amnesia
Environmental governance reveals the sharpest contradictions. Lake restoration is celebrated—on banners. Yet lakes continue to vanish under layouts and construction. Buffer zones are diluted, stormwater channels erased, and every monsoon flood is labelled “unexpected,” as though rain were a recent invention.
Net-zero slogans ring hollow when concrete repeatedly defeats catchment logic. The Nizam built stormwater drains nearly a century ago—with less data and more wisdom. Today, with satellites and simulations, we somehow forget to prioritise drainage. In a water-stressed region, growth must learn restraint. Some activities simply cannot expand indefinitely. This is not anti-development; it is ecological common sense.
Planning Without People in PURE and RARE ZONES
Planning in Telangana has become increasingly technocratic. Data is abundant, consultants confident, presentations immaculate. Public participation, however, remains ceremonial. Gram Sabhas are formalities, social audits exist mostly on paper, and community consent is praised in speeches and avoided in decisions.
Data can assist planning, but it cannot replace field realities. Farmers losing access to tanks, slum dwellers pushed to distant peripheries, commuters trapped for hours—these are not anomalies. They are symptoms of systemic stress.
A Memory from Pencils and Patience
The Telangana Rising 2047 vision captures ambition and optimism. It also reveals overconfidence. By underplaying inequality, ecological limits, and institutional fragility, it risks becoming a technocratic dream—impressive, elegant, detached.
I recall a study conducted in the mid-1960s by Osmania University on Metropolitan Hyderabad. Planning then was done with pencils and patience. We classified the region modestly: an urban core, a zone of metropolitan influence, and a dependent hinterland supplying food, labour, and water.
Six decades later, despite GIS platforms and glossy vision documents, the structure remains familiar. The vocabulary has changed; the geography has not. Our study quietly informed its Master Plan—without slogans or hashtags. This raises an uncomfortable question: before today’s grand visions were announced, were comparable field studies undertaken? Or has planning become confident remembrance rather than fresh inquiry?
Ambition, Memory, and a Forgotten Footnote
This is not an argument against ambition, but for grounding it. The CURE cannot rise by draining its hinterland. Telangana cannot prosper by ignoring its limits. Development that moves too fast eventually trips over its own claims.
One small question, however, escaped even a trillion-dollar vision. Did the document consider what happens if Hyderabad one day becomes a Union Territory? Not prophecy—just budgeting. Revenues would politely travel to Delhi; expenditures would stubbornly remain. Telangana would retain responsibilities, lose receipts in federal irony. What is the future of RARE?
The vision is silent—perhaps assuming political geography is as permanent as its cover design. Like groundwater, this possibility appears to have been ignored.
Planning that accounts only for good news is not vision; it is optimism with graphics. Ambition is admirable. Amnesia is expensive.
If Telangana truly wishes to rise by 2047, it must slow down enough to remember—its ecology, its people, and its past. Otherwise, the vision will shine brightly on paper, while the city—unimpressed and unforgiving—continues to reveal the cost of forgetting.
Prof. RAIRAO RAM MOHAN RAO (The Uncomfortable Hyderabadi from the banks of Musi)
భూస్వామ్య ప్రభువులు - సేవకులు ఇంకానా !
న్యాయవ్యవస్థలో ఫ్యూడల్ సంస్కృతి ఎక్కువ. ఈ సంస్కృతి భారతదేశమంతటా విస్తరించి ఉంది. ఈ సంస్కృతి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరీ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మాట అనడానికి కారణం ఈ మధ్య సుప్రీంకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు వెలువరించిన తీర్పులు. అవి…నిర్భయసింగ్ సూలీయా వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఎఫ్.ఎల్.సి. (సి) నం. 24570/2024. ఇది సుప్రీంకోర్టు తీర్పు. రెండోది మధ్యప్రదేశ్ హైకోర్టు జగత్‌మోహన్ చతుర్వేది వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 2025 ఎస్.సీ.సీ. ఆన్‌లైన్ మధ్యప్రదేశ్ 2314. తీర్పు తేదీ 14-7-2025. ఈ హైకోర్టు న్యాయమూర్తులు ఎక్కువ మంది గతంలో హైకోర్టుల్లో న్యాయవాదులుగా పనిచేసినవాళ్ళే. వీరందరూ తమ పదోన్నతి కోసం న్యాయమూర్తుల చుట్టూ , రాజకీయనాయకుల చుట్టూ ఎంత తిరిగారో, ఎన్ని అగచాట్లు పడ్డారో నేను చెబితే బాగుండదు. ఎవరికివారు తమ గుండెలమీద చేయి వేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. ఇలా న్యాయమూర్తులుగా ఎదిగిన వాళ్ళు దిగువ కోర్టు న్యాయమూర్తులను మనుషులుగా చూస్తే చాలు. కానీ, అలా జరగడం లేదు. నా ఈ మాటలకు మినహాయింపులు ఉన్నాయి.
న్యాయమూర్తులకు ‘ఈగో’ కూడా ఎక్కువ. ఈ మాటలు నేను అనడం లేదు. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్‌లోని మన రాష్ట్రానికి చెందిన జస్టిస్ సంజయ్‌కుమార్ అన్న మాటలు. ఈ ఫ్యూడల్ సంస్కృతి అంటని న్యాయమూర్తి సంజయ్ కుమార్. అందుకే ఆయన ఈ మాటలను అనగలిగారు. గత మే నెలలో న్యాయమూర్తులు సంజయ్ కుమార్, విక్రమ్‌నాథ్ బెంచి ముందు ఓ న్యాయవాది తన కేసులో తన సీనియర్ హైకోర్టులో ఒక కేసుని వాదిస్తున్నారని అందువల్ల అతను బిజీగా ఉండటం వల్ల సుప్రీంకోర్టుకి ఇంకా చేరుకోలేదని కోర్టుకి విన్నవించారు. అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కుమార్ ఆ న్యాయవాదితో ఇలా అన్నారు. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఈగోని కించపరచకూడదని అనుకుంటే అటువంటి సమాచారాన్ని అంత సులువుగా వెల్లడించకూడదు’ అని ఆ న్యాయవాదికి సూచించారు. న్యాయమూర్తుల అహంకారాలు చాలా పెలుసుగా ఉంటాయని న్యాయమూర్తి అన్నారు. అక్కడితో ఆయన ఊరుకోలేదు. ‘మీరు అంత నిజాయితీగా ఉండకూడదు’. భవిష్యత్తులో ఇలాచేయకండి. హైకోర్టులో మీ సీనియర్ బిజీగా ఉన్నారని సుప్రీంకోర్టులో ఎప్పుడూ చెప్పకూడదు.
మా ఈగోలు చాలా పెలుసుగా ఉంటాయి. అలా చెబితే మీ కేసు బయటపడుతుంది. అర్హతల మీద కాదు. ఇలాంటివి చెప్పకండి. చిన్న చిన్న అబద్ధాలు చెప్పండి. అవి అనుమతించడం జరుగుతుంది. అంటే కేసు మెరిట్ మీద కాకుండా మరోవిధంగా పరిష్కరించడం జరుగుతుందని ఆ న్యాయవాదికి జస్టిస్ సంజయ్ కుమార్ చెప్పారు. ఈ సూచన ఎలా ఉందంటే రావిశాస్త్రి రాసిన ‘మాయ’ కథలో సీనియర్ న్యాయవాది తన జూనియర్‌కు చెప్పినట్టుగా ఉంది. ఈ విషయాలను జస్టిస్ విక్రమ్‌నాథ్ కూడా అంగీకరిస్తూ ఇలా అన్నారు. మీ సీనియర్ మీకు ఈ విషయాలు నేర్పించి ఉండాలి. నిర్భయ్ సింగ్ సూరీయా తీర్పుని సుప్రీంకోర్టు 5 జనవరి 2026న వెలువరించింది. ఆ తీర్పుని చదివిన తరువాత జస్టిస్ సంజయ్‌కుమార్ మాటలు అదేవిధంగా జగత్‌మోహన్ చతుర్వేది కేసులో న్యాయమూర్తి అతుల్ శ్రీధరన్ బెంచ్ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి.
నిర్భయ్‌సింగ్ సూలీయా కేసు
నిర్భయ్‌సింగ్ సూరీయా మధ్యప్రదేశ్‌లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేసేవాడు. అవినీతి, డబుల్ స్టాండర్డ్స్‌గా వ్యవహరిస్తున్న కారణాలు చూపి అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. తప్పుడు ఉత్తర్వులు వెలువరించినందుకు ఉద్యోగం నుంచి తొలగించడం సమంజసమేనా అన్నది ప్రధానమైన విషయంగా సుప్రీంకోర్టు పరిశీలించింది. న్యాయపరమైన బెయిల్ ఉత్తర్వుల్లో తప్పులు దొర్లినంత మాత్రాన ఉద్యోగం నుంచి తొలగించడం సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తప్పుగా రాయడం దుష్ప్రవర్తన కిందకు రాదని, అతనిపై అవినీతి ఆరోపణలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడి తిరిగి ఉద్యోగంలో నియమించాలని ఆదేశించింది. తప్పుగా ఉత్తర్వులు రాయడానికి, మిస్ కాండక్ట్‌కి చాలా భేదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అవినీతి, పూర్వభావనలు ఉన్నప్పుడు మాత్రమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలాకాకుండా న్యాయపరమైన ఉత్తర్వుల్లో తప్పిదాల కారణంగా చర్యలు తీసుకుంటే న్యాయవ్యవస్థలో స్వతంత్రత విలువ తగ్గిపోతుందని కోర్టు ఈ కేసులో అభిప్రాయపడి అతనికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జేబీ పర్థివాలా, కేవీ విశ్వనాథన్‌లు వెలువరించారు.
జగత్ మోహన్ చతుర్వేది కేసు
జగత్ మోహన్ చతుర్వేది 1987వ సంవత్సరంలో సివిల్ జడ్జిగా చేరి పదోన్నతి మీద జిల్లా జడ్జి అయినాడు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రదేశ్ న్యాయమూర్తిగా పనిచేశారు. అతని సర్వీస్ అంతా కూడా మచ్చ లేకుండా కొనసాగింది. అధికారిక విధులు నిర్వహణకి సంబంధించిఎప్పుడూ ఒక్క నోటీసు కూడా అతను తీసుకోలేదు. 2015వ సంవత్సరంలో బెయిల్ దరఖాస్తులను ఆమోదించడంలో తిరస్కరించడంలో అవకతవకలు ఉన్నాయని అతనికి చార్జ్‌షీట్ జారీ చేశారు. ఆ తరువాత జరిగిన డిపార్ట్‌మెంటల్ విచారణలో ఒకే ఒక సాక్షిని విచారించారు. ఎలాంటి డాక్యుమెంట్లు కూడా లేవు. అతనిపై అభియోగాలు ఋజువైనాయని పేర్కొంటూ విచారణ అధికారి నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఆ న్యాయమూర్తి దానికి సమాధానం ఇచ్చాడు. అతడిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. దీనిపై సివిల్ సర్వీసెస్ నియమాల ప్రకారం అప్పీలుని దాఖలు చేశాడు. దాన్ని కొట్టివేశారు. దీంతో హైకోర్టులో రిట్ పిటిషన్ని దాఖలు చేశాడు. న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్, దినేష్‌కుమార్ పరివాల్ బెంచ్ ముందు ఈ దరఖాస్తు వచ్చింది. న్యాయమూర్తి అతుల్ శ్రీధరన్ తీర్పుని ప్రకటించారు.
విశ్లేషణ
అతనిపై మోపిన మూడో అభియోగంలో మాత్రమే అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బెయిల్ దరఖాస్తు తిరస్కరించబడిన నిందితులు ఎవరూ ఆ న్యాయమూర్తిపై ఫిర్యాదు చేయలేదు. విచారణ సమయంలో తాను ముందస్తు బెయిల్‌ను మేజిస్ట్రేట్స్ విచారించే కేసుల్లోనే ఇచ్చానని న్యాయమూర్తి చెప్పుకున్నాడు. బెయిలు మంజూరు చేసిన తరువాత సెషన్స్ కోర్టు విచారించే కేసులని పోలీసులు చేర్చినారని ఆ న్యాయమూర్తి చెప్పాడు. విచారణలో అధికారి విచారించిన ఒకే ఒక సాక్షి, ఆ న్యాయమూర్తిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. శాఖాపరమైన విచారణలో ఆ న్యాయమూర్తి జారీచేసిన ఆదేశాలను అప్పిలేట్ కోర్టు మాదిరిగా విచారణాధికారి పరిశీలించాడు. ఆ న్యాయమూర్తి జారీ చేసిన బెయిలు ఉత్తర్వులకు వ్యతిరేకంగా స్టేట్ హైకోర్టులో సవాలు చేయలేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు అతడిని తొలగించడాన్ని కొట్టివేసింది.
శాశ్వత భయంతో పనిచేస్తున్న జిల్లా న్యాయవ్యవస్థ
న్యాయవ్యవస్థలో నెలకొని ఉన్న భూస్వామ్య సామాజిక కారణాల వల్ల విచారణ సమర్థవంతంగా జరగలేదని, పరిష్కారం కాలేదని ఈ వ్యాధి అన్ని కేసుల మాదిరిగా ఈ కేసులో కూడా ఉందని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. జిల్లా న్యాయవ్యవస్థ హైకోర్టు భయంతో పనిచేస్తుందని కోర్టు అభిప్రాయపడింది. నిందితులకు అనుకూలంగా బెయిలు మంజూరు చేయడం వల్ల న్యాయమూర్తిని ఉద్యోగం నుంచి తొలగించారన్న సందేశం జిల్లా న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న న్యాయమూర్తులందరీకి చేరిందని, అందుకని బెయిల్స్‌ను మంజూరు చేయడానికి, కేసులను కొట్టివేయడానికి న్యాయమూర్తులు జంకుతున్నారని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. హైకోర్టు న్యాయమూర్తులకి, జిల్లా న్యాయవ్యవస్థ న్యాయమూర్తులకి మధ్య దుర్భరమైన సంబంధం ఏర్పడింది. అది భూస్వామ్యప్రభువుకి, సేవకుడికి మధ్య ఉన్న సంబంధం మాదిరిగా మారిపోయింది. జిల్లా జడ్జీలు హైకోర్టు న్యాయమూర్తిని పలకరించేటప్పుడు వారి శరీర భాష చాలా దయనీయంగా ఉంటుందని, దీనివల్ల వాళ్ళు వెన్నెముక లేని “అకశేరుక క్షీరదాలజాతి”గా మారిపోతున్నారని కోర్టు అభిప్రాయపడింది.
న్యాయమూర్తులు మూలాలను గుర్తుంచుకోవాలి
రైల్వే ఫ్లాట్‌ఫామ్‌ల మీద హైకోర్టు న్యాయమూర్తులను రిసీవ్ చేసుకుంటున్న జిల్లా న్యాయమూర్తులు రిఫ్రెష్‌మెంట్స్ పట్టుకుని వేచిచూడటం సర్వసాధారణం. అది వలస రాజ్యాల క్షీణతను శాశ్వతం చేస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్‌కుమార్, హైకోర్టు న్యాయమూర్తి అతుల్ శ్రీధరన్ లాంటి వాళ్ళు న్యాయవ్యవస్థలో అతి తక్కువగా ఉన్నారు. నేను 2015లో ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ మేజిస్ట్రేట్ ఈ అసౌకర్యం గురించి చెప్పాడు. కోర్టు సమయాల్లో కూడా వెళ్ళాల్సి వస్తోందని చెప్పాడు. అలా వెళ్ళవద్దని క్లాసులో చెప్పాను. నేను అలాగే ఉన్నాను. 2023లో మళ్ళీ తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు కూడా చెప్పాను. నాలాంటి ఒకరిద్దరు తప్ప అందరూ అలా ఉండలేకపోతున్నారు. భయాలు, ఆశలు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ మూలాలను గుర్తుచేసుకుంటే తప్ప ఈ భూస్వామ్య ప్రభువు, సేవకుడు భావనలు పోవు.
డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్)
Anti-Defection Law: The need to review the eligibility of disqualified legislators from contesting re-election
The 10th Schedule of the Constitution of India relating to the Anti-Defection Law was introduced in 1985 to curb the unethical defection by a member of a legislative body. It empowers the Speaker to disqualify a member who has switched his party allegiance to another political party. The Law has not set any time frame for passing orders on complaints of defection by the Speaker nor a provision is made barring the disqualified member to contest re-election.
The established legal position is that the Supreme Court has set time frame in specific cases in deciding disqualification petitions to prevent indefinite delays. The Supreme Court ruled in Shrimanth Balasaheb Patil v. Hon’ble Speaker, Karnataka Legislative Assembly that the Tenth Schedule does not remove the disqualified member’s right to contest re-election.
However, final verdicts in defection complaints are not being delivered within a reasonable period. The tainted members are holding their seats in the House even though their defection is patently obvious.
A member of a legislative body is chosen by a political party to contest on its symbol and elected as a representative of that political party with the support of millions of voters. The same elected member, for his selfish needs and giving a go-bye to the faith of millions of voters, is subsequently switching his loyalty shamelessly to the other political party.
The policy of switching political parties was first promoted in the State of Haryana as “Aayaram-Gayaram”. This is also popularly termed as “Cat on the Wall”. It is just a lame excuse of the defected member to claim that if he is in the ruling party, there is a greater chance of getting more funds for the development of the Constituency.
The common man’s opinion is that the defected member is only sticking to the ruling party to protect his illegally acquired assets from the inquiries of the Central Bureau of Investigation or other investigative agencies, or with an intention of getting an official berth or contracts. The law is meant to penalize defected legislators but many legislators do not mind if they do not abide by it.
The Constitution empowers the Speaker to disqualify a member for the remainder of his term if he comes to the conclusion that he has defected from the political party from which he was elected. While a disqualification petition is pending before the Speaker, a member may also voluntarily submit his resignation from membership. In both cases, same candidate like a washed pearl can contest the by-election or general election as a representative of the political party of his choice.
The Tenth Schedule is limited only to the disqualification of a member for a remainder term of the House. Because of deliberate omission of legal action other than disqualification, the Ayarams and Gayarams are turning the situation to their advantage.
In contrast, if an elected member is convicted of any of the offences mentioned in sections 8 to 10 of the Representation of the People Act, 1951, he is disqualified from contesting elections to the legislative bodies for a period of three to six years. Why is not there a similar law in the Constitution of India?
If a member is elected as a representative of a political party by the will of millions of voters and subsequently switches to another political party for his personal gains, he should not only be disqualified for the remainder term of the House but also should be disqualified from re-election for a certain number of years. The subsequent resignation by a defected member also shall meet the same fate.
Apart from that, the time frame to decide the defection complaint should also be brought through a Constitutional amendment. Only then these unethical defections be curbed and the mandate of the voters will be respected. Elected members will be held accountable to their constituents and that members of the ruling party will have little scope to join hands with the opposition to topple or destabilize the government. Simultaneously, the ruling party would not have the opportunity to entice or induce members of the opposition party.
Should a member, for any reason, find his party’s policies objectionable, he should resign, explain the reasons to the electorate in a fresh election and seek a new mandate according to the voters’ wishes. A fixed deadline would establish greater accountability in the anti-defection process. To bring about political reforms, constitutional amendments with reference to time limits and penal provisions are necessary.
Tadakamalla Muralidhar,
Former District Judge
ఉత్తమ పోలీస్ స్టేషన్
ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ, వారి అభిమానాన్ని పొందే ప్రభుత్వ విభాగాల్లో పోలీస్ శాఖ అత్యంత కీలకమైనది. పోలీస్ స్టేషన్ల పనితీరు పైనే ఆ శాఖ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ‘1861 పోలీస్ చట్టం’ ద్వారా బ్రిటిష్ వారు తమ స్వార్థం కోసం పోలీస్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ, స్వాతంత్య్రం తరువాత ఇది ప్రజల హక్కులను, ప్రాణాలను రక్షించే ప్రధాన కవచంగా మారింది. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా అద్భుతమైన సేవలు అందించే పోలీస్ స్టేషన్లను ప్రోత్సహించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా 10 ‘ఉత్తమ పోలీస్ స్టేషన్ ‘ ర్యాంకులను ప్రకటిస్తోంది.
ఉత్తమ స్టేషన్ల ఎంపిక ప్రక్రియ మొదట 2016లో హైదరాబాదులోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన 51వ డీజీపీల సమావేశంలో నిర్ణయించారు. ఈ ఎంపిక కోసం సుమారు 161 అంశాలతో కూడిన కఠినమైన ప్రశ్నావళిని ఉపయోగిస్తారు. ఆ పోలీస్‌స్టేషన్ పనితీరుపై ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారు. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో 80 శాతం మంది ప్రజలు దాని పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తపరచాలి. ఈ ప్రక్రియ నిర్వహణ అంతా ‘క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ‘ఆధ్వర్యంలో జరుగుతుంది. వీరు పోలీస్ స్టేషన్‌లో దోమల నియంత్రణ యంత్రాలు ఉన్నాయా, మరుగుదొడ్ల నిర్వహణ సరిగా ఉందా లేదా అన్న చిన్న అంశాలను కూడా పరిశీలిస్తారు.
2017లో ఉత్తమ 10 పోలీస్ స్టేషన్ల ఎంపిక ప్రారంభమైంది. ఆ ఏడాది హైదరాబాదులోని పంజాగుట్ట పీ.ఎస్ దేశంలో రెండవ స్థానాన్ని దక్కించుకోగా, 2024లో శాలిబండ పీ.ఎస్. ఎనిమిదవ స్థానం సాధించింది. తాజాగా, 2025 సంవత్సరానికి గానూ సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని షామీర్‌పేట పోలీస్ స్టేషన్ దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జిల్లాలోని ఈ స్టేషన్ సుమారు 80,000 జనాభా ఉన్న 25 గ్రామాలకు సేవలందిస్తోంది. త్వరితగతిన కేసుల నమోదులో ఈ స్టేషన్ ముందుంది. ఎఫ్.ఐ.ఆర్ నమోదులో జాప్యం లేకుండా నెలకు సగటున 90 కేసులు నమోదు చేస్తున్నారు. హత్య కేసుల్లో 90 రోజులు, లైంగిక దాడుల కేసుల్లో 60 రోజుల లోపే ఛార్జ్‌షీట్లు దాఖలు చేస్తున్నారు. మహిళా కేసుల విచారణ మహిళా కానిస్టేబుళ్ళ సమక్షంలోనే జరుగుతుంది. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులతో సిబ్బంది సభ్యతగా వ్యవహరిస్తారు. అలాగే స్టేషన్ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంచుతున్నారు. పోలీస్‌స్టేషన్ అనేది కేవలం నేరాలను అరికట్టే కేంద్రం మాత్రమే కాదు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చే దేవాలయం వంటిదని ఈ గుర్తింపు నిరూపిస్తోంది.
డా// పి. మోహన్ రావు
మెంబరు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
FGG IN NEWS
FGG IN ACTION
FGG Submitted representations to various departments in the month of DECEMBER 2025
- To the Commissioner, State Election Commission regarding Gram Panchayat elections, conduct of press meet by F.G.G., Deliberations of press meet, Representation to S.E.C – on 2-12-2025
- To the Chief Electoral Officer, Telangana State regarding By-elections to Jubilee hills Assembly constituency, Heavy expenditure incurred by District Election Authority in conduct of elections, Request for Audit of accounts – on 5-12-2025
- To the Commissioner, Civil Supplies department regarding serious allegations on functioning of Godowns in Civil Supplies Corporation working, Request for inquiry – on 8-12-2025
- To the Commissioner, Prohibition & Excise department regarding People drinking cool drinks mixed with Alprazolam, Request to control the use of Alprazolam – on 8-12-2025
- To the Commissioner, Endowments department regarding information about Temple lands – on 17-12-2025
- To the Chief Minister, Telangana State regardingC.B. cases, Abnormal delay in prosecution, Conviction rate only 50%, Request to issue suitable instructions for quick disposal and improvement in conviction rate – on 18-12-2025
- To the Prl. Secretary, MA&UD department regarding H.M.C. Study tour of 145 Corporators at the fag end of their term, Request not to approve the study tour – on 30-12-2025
FGG submitted following RTI letters to various departments in the month of DECEMBER 2025
- To the PIO, O/o Prl. Secretary, Home department regarding Police reforms – on 8-12-2025
- To the PIO, O/o Commissioner, Food Safety regarding raids on hotels – on 8-12-2025
- To the PIO. O/o Prl. Secretary, School Education department, regarding review meeting with senior officials – on 8-12-2025
- To the PIO. O/o Prl. Secretary, Revenue department regarding status of Representation sent To Chief Minister on Commercial Tax officers – on 11-12-2025
- To the PIO. O/o Prl. Secretary, I&CAD department regarding Kaleshwaram project -on 11-12-2025
- To the PIO, O/o Director General, ACB regarding breakup of cases department wise -on 11-12-2025
- To the PIO, O/o Commissioner, Minority Welfare department regarding Shadi Mubarak – on 11-12-2025
- To the PIO, O/o Gram Panchayat, Ankapuram Village, Nizamabad district regarding details of Village – on 17-12-2025
FGG TIMES
M. Padmanabha Reddy I.F.S.(R) (President)