FGG TIMES

సుప‌రిపాల‌నే ధ్యేయంగా

Editor: T. Vivek,   Associate Editor: Prof. Raghuram Rao Akkinepally

Vol. No. 1  |  Issue No. 3  |  Monthly News Letter  | March 2025 

సుపరిపాలనలో పారదర్శకతోనే ప్రజలకు ప్రభుత్వాలపై విశ్వాసం పెరుగుతుంది.

ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు స్పష్టంగా తెలియచేయాలి. పాలకులు తమ విధానాలను, అభివృద్ధి కార్యక్రమాలను, మరియు నిధుల వినియోగ వివరాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తే, ప్రజల్లో అనుమానాలు తలెత్తే అవకాశం తగ్గుతుంది. పారదర్శకత ద్వారా, ప్రజలు ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోగలరు.   పాలకులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. అవినీతికి అవకాశం తగ్గుతుంది. ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనగలరు.   పారదర్శక పాలన వల్ల ప్రజలు తమ హక్కులను, ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని అర్థం చేసుకుని, అవి సమర్థవంతంగా అమలవుతున్నాయా? లేదా? అన్నదానిపై అభిప్రాయం వ్యక్తపరచగలుగుతారు. పాలకులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేస్తే, ప్రజాస్వామ్యం బలపడుతుంది, ప్రజల విశ్వాసం ప్రభుత్వాలపై పెరుగుతుంది.

ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌

In Focus

మేధావులు మౌనాన్ని వీడాలి

మాకు ఒకే లక్ష్యం – అవినీతి రహిత ప్రపంచం కావాలని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ గొంతెత్తి చెబుతోంది . ఆ సంస్థ ప్రధాన కార్యాలయం బెర్లిన్, జర్మనీలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 100+ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాని యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటంటే , అవినీతిని బహిర్గతం చేయడం, అవినీతిని ఎదుర్కొనడం, అవినీతిని అంతం చేయడమే ప్రధాన లక్ష్యం అంటోంది. సమాజంలోని అన్ని స్థాయిల్లో మరియు అన్ని రంగాల్లో అవినీతి నివారించడంతో పాటు పారదర్శకత, బాధ్య‌త‌ల‌ను పెంపొందించడం , మరియు నిజాయితీని ప్రోత్సహించడమే ఆ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఆ సంస్థ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 1993లో స్థాపించబడింది. .
ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యకలాపాలు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సూచిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేశాల అవినీతి స్థాయిని అంచనా వేస్తుంది. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, వ్యాపార సంస్థలు అవినీతి రహితంగా ఉండేలా సిఫార్సులు, పర్యవేక్షణ వంటి అంశాలపై దృష్టి పెట్టడం.
అదే విధంగా అవినీతి వ్యతిరేక చట్టాల కోసం ప్రచారం, వివిధ దేశాల్లో కఠినమైన చట్టాలను అమలు కోసం ప్రయత్నాలు, విధాన మార్పులకు ఒత్తిడి మరియు విజిల్ బ్లోయర్సు బాధితులకు సహాయం, అవినీతిని బయటపెట్టే వ్యక్తులకు రక్షణ కల్పించడం కోసం సహాయం అందించడం.

అందులో భాగంగానే గత నెల 11 న ట్రాన్పరెన్సి ఇంటర్నేషనల్ ప్రతి ఏడాది ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే 2024 సంవత్సరము యొక్క కరప్షన్ పర్సిప్షను ఇండెక్స్ సూచికను విడుదల చేసింది. 180 దేశాల్లో ఆ దేశంలోని పరిపాలనలో బాగంగా జరుగుతున్న అవినీతి గురించి ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం ఏ ర్యాకింగ్ లో వుందని వారి అధ్యయనం ద్వారా మన దేశ ర్యాంకు 96 వ స్థానంలో నిలిచింది. వారి యొక్క అధ్యయనం ప్రకారం మన దేశానికి 38 మార్కులు వచ్చాయి. జిరో మార్కుల వచ్చిన దేశం అత్యధికంగా అవినీతి పాల్పడుతుందని, అదేవిధంగా 100 మార్కులు వచ్చిన దేశం అవినీతి రహిత దేశంగా ఉందని కొన్ని పద్ధతుల్లో అధ్యయనం ప్రతి ఏడాది జరుగుతోంది . అయితే పోయిన 2023 ఏడాది మన దేశం 39 మార్కులు సాధించి ప్రపంచ వ్యాప్తంగా 93 వ ర్యాంకు సాధించింది. ఈ ఏడాది శ్రీ లంక 121 వ ,పాకిస్తాన్ 135 వ ర్యాంక్ తో మన తర్వాత స్థానం లో ఉన్నాయి. జపాన్ ,యూ కే 20 వ ర్యాంకు తో అమేరికా 63 వ ర్యాంకు చైనా 76 వ ర్యాంకు తో మన కంటే తక్కువ అవినీతి దేశాల‌ జాబితాలో ఉన్నాయి. మన తర్వాత స్వతంత్రం పొందిన దేశాలు పాలనలో ఖచ్చితమైన చర్యలు అవలంబించి అవినీతిని అరికట్టుకొని మంచి మార్కులు సాధించి పై స్థాయిలో ఉన్నాయి.

నాగరిక ప్రపంచంలో అవినీతియే మనషుల మద్య నమ్మకాలు మందగిస్తాయని, అవినీతియే ప్రజాస్వామ్యం బలహీన పడుతుందని ,అవినీతియే నిరుద్యోగానికి ,పేదరికానికి వలసలు కారణమని తెలియక కుల మత ప్రాంత లింగ భేదాలతో ఘర్షణ పడుతున్నాం.
ఒక దేశంలో అవినీతి పెరిగితే ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం సన్నగిల్లుతుంది. అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ ప్రజల్లో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పోతుంది. ప్రజలు తమ ఓటును నాయకులు మీద నమ్మకం లేక అమ్ముకుంటారు. నాయకులు కూడా విపరీతంగా ఎన్నికల్లో ఖర్చు చేసి ఆ తర్వాత ప్రజల సొమ్ము దోచుకుంటారు. మేము ఏమి తక్కువ కాదని అధికారులు కూడా లంచం తీసుకోకుండా పని చేయరు. అవినీతి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది, పారదర్శకత తగ్గి, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. న్యాయవ్యవస్థపై ప్రభావం చూపించి చట్టాల సరైన అమలును అడ్డుకుంటుంది. అధికారులు దుర్వినియోగం పెరిగి, ధనికులు మరియు అధికారులు లాభపడేలా చేస్తుంది, సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలు ఎన్నికలపై ఆసక్తి కోల్పోయి, పాలనలో పాల్గొనడం తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో, ప్రజాస్వామ్యం తన అసలు ఉద్దేశాన్ని కోల్పోయి, అధికార దుర్వినియోగం పెరిగేలా చేసి నియంతృత్వ పాలనకు మార్గం సుగమం చేస్తుంది. అవినీతి వల్ల ఉద్యోగావకాశాలు తగ్గి నిరుద్యోగం పెరుగుతుంది. పారదర్శకత లేకపోవడం, న్యాయసమ్మతమైన అవకాశాలు అందకపోవడం వలన పెట్టుబడిదారులు భయపడతారు, ఫలితంగా కొత్తగా పెట్టుబడులు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఈ పరిస్థితి ప్రతిభావంతులను గుర్తించలేక పోవడంతో మెరుగైన అవకాశాల కోసం యువత విదేశాలకు వెళ్ళడంతో బ్రెయిన్ డ్రైన్‌కు దారితీస్తుంది . అదే కాకుండా, ఆర్థిక అభివృద్ధిని కూడా నిలిపి పేదరిక స్థాయిలను పెంచుతుంది.

ఇవన్నీ కూడా మౌనంగా ఉన్న మేధావులకు తెలియదా అంటే తెలుస‌నే చెప్పాలి. కానీ వారిని మనం చట్టసభల్లో పంపలేము , వారు ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చు భరించి రాజకీయాలలో ప్రవేశించలేరు. ప్రస్తుత సమాజం మేధావులకు కొరవేమిలేదు. మనకెందుకులే, మార్పు కోసం ధైర్యం చేయలేక తటస్థులుగా మిగిలిపోతున్నారు ..

తాము మేధావులమని నిజాయితీ పరులమని ఇతరుల మేధస్సును నిజాయితీని ఒప్పుకోరు , ఇతరులను కలుపుకోరు మంచి వారిని ప్రోత్సహించలేరు . మనదేశంలో మనము అందరూ చేసేది తప్పులే నని కాకపోతే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంతే తమకు తాముగా సర్దుబాటు చేసుకుంటూ బతికేస్తున్నాము. మనమైన భారతీయులము మార్పు కోసం ప్రయత్నం చేయ్యం . మార్పు కోసం పోరాటం చేసే వారికి సహకరించము , చెయ్యనియ్యము. సామాన్య ప్రజలకు పూర్తిగా ప్రజాస్వామ్య ఫలాల‌ గురించి తెలియక తమ బాధ్యతలను మరిచి హక్కుల గురించి మాట్లాడడం భవిష్యత్ కొరకు సంపాదన కట్టుబాట్ల మధ్య,బ్రమల్లో జీవిస్తూ ఇతరులను విపరీత పోకడలతో ,సహనాన్ని కోల్పోయి ,నిందిస్తూ ఉంటారు కాలయాపన చేస్తారు. ఇదే మన సమాజం వెనుకబాటుకు కారణం. మన స్వతంత్ర పోరాటం సుదీర్ఘ కాలం కొనసాగడము మన వాళ్ళు మనకు సహకరించక పోవడం ఐక్యత కొరవడి వలన ఆలస్యమై ఎందరినో కోల్పోయామని చరిత్ర చెపుతుంది.

మన అభివృద్ధికి ఆటంకం అవినీతియేనని తెలుసుకుంటే మంచిది . ఒక బలమైన , దేశభక్తి గల నిరహంకారి, నిజాయితీ కలిగిన సమర్థుడైన నాయకుడు ఉంటే చాలు ఈ దేశం బాగుపడుతుంది. మన భవిష్యత్తు తరాల కోసం మనం ఆయన అన్వేషణలో ఉందాం.

సోమ శ్రీనివాస్ రెడ్డి
కార్యదర్శి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

ప్ర‌భుత్వ‌పాల‌న‌లో అవినీతి,  అక్ర‌మాలు జ‌రుగుతున్న‌ప్పుడే ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చేప‌డ‌తారు.  ప్ర‌భుత్వ‌పాల‌న స‌క్ర‌మంగా ఉంటే, ప్ర‌జ‌లు త‌మ ప‌నులు చేసుకుంటూ,  ప‌న్నుల‌ను సైతం నిజాయితీగా చెల్లిస్తారు.

Accountability of Legislatures

After many years of struggle and sacrifices, we won the long-fought battle of freedom. Freedom won must be protected by constitutional framework with high democratic values and state accountability to the people of India.

The holding of parliament & state legislatures sessions in a regular manner is vital in a representative democracy. The time of the house is most precious, and it should be utilized with meaningful debate on policy, legislation, issues of national importance, and constituency grievances. But over seven decades, there has been a decline in the number of sittings of the legislatures, curbing the effectiveness of the institutions.

A majoritarian culture seeks to diminish entrenched constitutional freedom by exclusiveness attitude towards opposition. Now, there exists a gap between aspirations of the people and reality of the function of legislatures.

In election time, candidates of all parties go to the doorstep of the voters, talk very affectionately, and promise many freebies which voters have not expected. After the election, voter aspirations are affected when the same leader becomes part of the ruling party. The ruling party during the debate do not have inclusive nature towards opposition and their views. Many times, the sessions get wasted on discussion on trivial and frivolous matters, leading to deterioration of quality and length of the debates.

Article 85 of the Constitution specifies that Parliament will meet with a gap of not more than 6 months between two sessions in a year.  While Article 174 provides similar provisions for the state legislature. The 1st Lok Sabha (1952-57) had met for 135 days, while the 17th Lok Sabha met only for 55 days. Similarly, state assemblies in India met for only 10 to 23 days per year. The Speaker’s conference in 1993 recommended minimum of 50 sittings for state legislatures having less than 70 legislators and minimum of  90 days of sittings for the rest of the states having more than 70 legislators

While parliaments of developed countries such as the USA, France, and the UK assemble for 146, 120, and 143 days per year, respectively, Japan parliament meets compulsorily for 150 days per year of sittings in Parliament. Justice Venkatachaliah Commission recommended a minimum of 100–120 days of sittings for Lok Sabha & Rajya Sabha.

Below poverty line is a benchmark of a country to estimate the development of a country. 6.7% population of India is under the poverty line. In health care, India ranks 66 out of 195 countries. Infant mortality is unacceptably high, causing serious concern. TB is one of the top burdensome infectious diseases in India having 28% of the world TB cases and with high mortality due to TB. Literacy empowers and liberates people. Literacy rate in India is 77% which requires government planning. India, a developing country with a huge population and has pushing challenges & issues to be solved. But the trend of shrinking legislative sittings of the legislatures and diminishing productivity in legislative debates masking the accountability of legislatures to the people of India. Hence the number of days of sittings has to be increased to address the numerous problems faced by people and the nation. All the voluntary organizations committed to protect the democracy need to represent the matter to the president of India or NITI Aayog to direct parliament to enact legislation to increase the number of sittings of legislatures (Parliament and State Assemblies).                         

Dr. C Vijaya Kumar Reddy  

(FGG Member)

రాజ‌రికంలో రాజు ఎలా ఉంటే, ప్ర‌జ‌లు అలా ఉండేవారు.    ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లు ఎలా ఉంటే, పాల‌కులు అలా ఉంటారు.   కాబ‌ట్టి మ‌న పాల‌కులు మారాల‌ని ఆశించే ముందు మ‌న‌ లోనే మార్పు రావాలి.   ఇదే ప్ర‌జాస్వామ్యం యొక్క అస‌లైన గొప్ప‌త‌నం.

నీతి, నిబద్ధత, విలువలు తప్పిన ఉపాధ్యాయులు ప్రలోభాలకై పరుగులు డబ్బుల పంపకాల్లో క్యాడర్ల మధ్య ఒకే సంఘంలో గొడవలు ఎంఎల్సీ ఎన్నికల్లో గురువుస్థానం గంగలోకే

ఆకాశమంత ఎత్తుగా ఉండవలసిన ఉపాధ్యాయ గౌరవం కాస్త అధఃపాతాళంలోకి పడిపోతున్నది. సాధారణ ఎన్నికల్లో సగటు ఓటర్ల కన్నా నీచానికి దిగజారి ఉపాధ్యాయలోకం ఓటుకు నోటు కోసం అర్రులు చాస్తున్నది. నిస్సిగ్గుగా బడి, బడి తిరిగి పంచుతున్న పైసల కథ గతితప్పిన ప్రజాస్వామ్య విలువల్ని సూచిస్తున్నది. రాజకీయ పార్టీలు పవిత్రమైన ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికల్లో వారివారి పెట్టుబడిదారుల్ని నిలబెట్టి అడ్డదారిలో పైకి తీసుకురావాలని గురువులకు తెగుల్లు పుట్టిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో పార్టీలు, డబ్బులు విచ్చలవిడిగా ప్రవహిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో కంటే ధర ఎక్కువ పలుకుతుండడం గమనార్హం. హుజురాబాద్ ఉప ఎన్నిక మాదిరిగా ఉపాధ్యాయ ఓటర్లు అభ్యర్థుల కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్న వైనం. ఉపాధ్యాయ హక్కులు, సమస్యలు, విద్యారంగ శ్రేయస్సు కోసం గొంతు విప్పడం, ప్రాతినిధ్యం చెయ్యాల్సిన శాసనమండలి సభ్యులు కనీస అవగాహన లేకుండా అంగట్లో సరుకులు కొనుక్కునే మాదిరిగా రావడం, స్ఫూర్తిని మరిచి ఓటరు మహాశయులు ఎక్కడ పడితే అక్కడ తలా ఓ చెయ్యి  చాపడం విడ్డూరం. సగటున జీతం ఎవరికి లక్షకు తక్కువలేదు. అందులో సుమారు నలభైశాతం పైగా ఇద్దరు భార్యా భర్త ఉపాధ్యాయులే. రెండు, రెండు కార్లున్నవారు, పిల్లలు విదేశాల్లో చదువుతున్న వారు కూడా ఇదే కోవలోనికి రావడం బాధాకరం. నిస్సిగ్గుగా ప్రలోభాలు తీసుకోవడంలోనూ నిజాయితీ తప్పారు టీచర్లు. ఒక అభ్యర్థి 5000 ఇస్తే తీసుకొని అతనికి ఓటు వెయ్యవలసి ఉండగా, మరో అభ్యర్థి ఇచ్చే 3000 తీసుకోవడం, మూడో అభ్యర్థి ఎప్పుడిస్తారా? అని ఎదురు చూడడం దారుణం. ఒక సంఘం మండల, జిల్లా నాయకుడు వారి అభ్యర్థి బరిలో ఉన్నా మరో అభ్యర్థి వద్ద తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జాతి నిర్మాతల ఆదర్శం రేపటి ఫలితాల్లో తేటతెల్లమవుతుంది.

ఓ ఇరవైశాతం ఉపాధ్యాయులు డబ్బులు వద్దని నిరాకరిస్తున్నారు. ఇది ఆనందంతో ప్రశంసించవలసిన అంశం. మహిళా టీచర్లను బస్సుల్లో విహార యాత్రలకు తీసుకెళ్ళడం, పురుషులకు మందు, విందు ఇవ్వడం సర్వసాధారణ అంశం. కార్పొరేటు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు బరిలో ఉండడం చూసి కొందరు పోటీనుండి తప్పుకున్నారంటే డబ్బు ప్రభావం ఎంతగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. కేజీబీవీ, కాంట్రాక్టు టీచర్లు తక్కువ జీతంతో, సరిగ్గా జీతాలు రాక, ఉద్యోగ భద్రత లేక డబ్బు తీసుకోవడం కొంత ఆలోచించవచ్చు. ఒక పీజీ హెచ్ఏం, వారి స్పాజ్ స్కూల్ అసిస్టెంట్ లాంటి వారు కూడా 5000 లతో పాటు 3000 తీసుకోవడం గమనార్హం. రేపు ఉపాధ్యాయుడి విలువ ఏ స్థాయికి పడిపోతుందా, హక్కుల గురించి ప్రశ్నించే నైతికత ఉపాధ్యాయులు ఎలా కోల్పోతారో అంచనా వేసుకోవాలి. తప్పేముంది? దేశమంతా తీసుకోవడం లేదా? ఇదేమైనా సక్రమమైన రీతిగా సంపాదించిన డబ్బా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా నాయకులకు, రాష్ట్రనాయకులకు మాకు డబ్బులు రాలేదని, ఎప్పుడిస్తారని కాల్ చేసి ప్రశ్నిస్తున్నారంటే టీచర్ల మానసికస్థితిని అర్థం చేసుకోవాలి. ఒక అభ్యర్థి 5000 పట్టుకొని ఒక మహిళా టీచర్ వద్దకు వెళ్తే, నేను ధర్మానికే ఓటు వేద్దాం అనుకున్నాను. మీరు కూడా నీతి తప్పి డబ్బు పంచుతున్నారంటే మీ పార్టీకి ఓటు వేయనని డబ్బును తిరిగి కొట్టిన కథ ఒక్కటే కాస్త ఓదార్పుగా మిగిలింది. వివిధ సంఘాల జిల్లా నాయకులు సహితం రెండవ ప్రాధాన్యత ఓటు మా సంఘం నుండి మీకు వేయిస్తామని బేరసారాలు ఆడుకొని డబ్బులు తీసుకున్న సంఘటనలు, కాల్ రికార్డు తో సహా దిగజారుడుతనానికి పరాకాష్టగా కనిపించింది. గత దశాబ్దకాలంగా సమస్యల చిట్టా అపరిష్కృతంగా ఉంది. సాధించుకోవలసిన సమస్యలు అనేకానేకం ఉండగా అమ్ముడుపోయే స్థితి సమస్యలను ఎంతలోతుగా పాతిపెడుతుందోనని సగటు, నిబద్ధత గల టీచర్లు ఆందళన చెందుతున్నారు. డబ్బు సంచులే గెలిస్తే సమాజంలో ఎలా తలెత్తుకోవాలని సాధారణ టీచరు బెంబేలెత్తిపోతున్నాడు. నీతి, నైతికత, విలువలు మరచిన ఉపాధ్యాయులే అధికంగా ఉన్న స్థితిలో సమాజ పయనమెటో తలచుకుంటే భయంగా ఉన్నది.

మాకు ఓటు లేదని, బ్రతికిపోయామని ఎస్జీటీ కేడర్, మిగతావారంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. రేపటి ఎన్నికల్లో ఉపాధ్యాయేతర కార్పోరేటు మరియు డబ్బు శక్తులు గెలిస్తే ఇక ఈ సమాజాన్ని బాగుచేసే నాధుడే ఉండరు. డబ్బు కంటే విలువ ముఖ్యం అని ఎందరో ఉపాద్యాయులు బతికి చూపించిన జాడ మరచి నేటి ఉపాధ్యాయ లోకం డబ్బు వెంట పరుగెత్తడం చూస్తుంటే సిగ్గుగా ఉంది. తినడానికే తిండి లేని స్థితిలో కూడ‌ ఆత్మాభిమానం తాకట్టు పెట్టని ఎందరో త్యాగమూర్తులు మనకు చరిత్రలో సాక్ష్యంగా కనపడతారు. అసలు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులుగా పనిచేసిన వారికి సహితం మరణించేవరకు సొంత ఇల్లు లేని నిబద్ధత మన చరిత్ర పుటల్లో పదిలంగా ఉంది. ఇంతటి సాంకేతిక యుగంలో ఉపాద్యాయ సంఘాలు రాజ్యాంగ స్ఫూర్తి మరచి అలాంటి అభ్యర్థులకు సీటు ఇవ్వడం బలపరచడం ఒక ఎత్తు అయితే, ఉపాద్యాయులు డబ్బులు తీసుకునే వ్యవహారంలో ఒకరికంటే ఒకరు ముందు అని పోటీ పడుతుందడం శోచనీయం.

ఈ రోజు జరిగిన ఓటింగ్ ఉపాధ్యాయ విలువలను, స్థాయిని, మర్యాదను, నిబద్ధతను లెక్క స్పష్టంగా తేల్చి చెప్పబోతున్న అంశం అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అందరూ అనుకున్న విధంగా డబ్బు గెలిస్తే ఒక ఉపాధ్యాయ విలువ సమాజంలో అడుగంటి పోవడం ఖాయం. సాధారణ జనం డబ్బు డబ్బు అని ఎన్నికల సమయంలో అనడంలో ఎలాంటి తప్పు ఉండదు.

నిబద్దత కలిగిన సగటు ఉపాధ్యాయుడు.

FGG IN NEWS

FGG IN ACTION

Representations

FGG Submitted Representations to Various Officials / Departments in the Month of February 2025

1. To Hon’ble Chief Minister of Telangana:

Subject: To ban on manufacture and marketing of S.U.P. in the state of Telangana – Submitted on 13-2-2025

2. To Hon’ble Chief Minister of Telangana:

Subject: Large scale irregularities   in   joint venture projects with private developers   during the years 2004 and 2005, enquiry by   Vigilance department, Housing department not  taking  action on Vigilance report – Submitted on 14-2-2025

3. To Hon’ble Chief Minister of Telangana:

Subject: Appointment of 36 agricultural officers on fake certificates, Vigilance conducted inquiry. Request to take   action on Vigilance Report –  Submitted on 14-2-2025

4. To Hon’ble Chief Minister of Telangana:

Subject: Allegation of misuse of Government lands and   irregular allotment of plots by office bearers of Secretariat mutually aided Co-op Housing Society, Enquiry by V&E department, No action taken since last 10 years on the enquiry report, Attempt to close the issue in Secretariat , Request for necessary action on the report of V&E – Submitted on 17-2-2025

Right to Information Act (RTI)

FGG submitted following RTI Request to various departments in the month of February 2025

1. The PIO, O/o Principal Secretary, Housing Department, Govt. of Telangana

Subject : Action taken on our representation regarding irregularities in allotment of Two  BHK houses   –  Submitted on 1-2-2025

2. To the PIO, O/o Principal Secretary, Environment, Forests, Science & Technology department

Subject : G.O. copy of monitoring cell constituted and work turned out by the said monitoring cell  – Submitted on 1-2-2025

3. To the PIO. O/o Principal Secretary to Government, Health, Medical & Family  Welfare department

Subject : Ministers statement regarding receive complaint on food adulteration and  appointment of food inspectors etc. – Submitted on 13-2-2025

4. To the PIO, O/o District Collector

Subject :  Constitute district level committees and Task force regarding Plastics   –Submitted on   17-2-2025

5. To the PIO, O/o Environmental Engineer

Subject : cases booked on ban on single use plastics -Submitted on 17-2-2025

FGG TIMES

Forum For Good Governance
 
H.No.6-1-69, Flat No.204,
G.K.R. Mansion Saifabad,
Lakdikapool, Hyderabad,
Pin : 500004
 
Phone: 040 2323 0334
 
Editorial Board:  
M. Padmanabha Reddy I.F.S.(R) (President)  
Soma Srinivas Reddy B.E (Secretary)
 
⁠Interested may send articles/ letters/ News to
E-mail: timesfgg@gmail.com