FGG TIMES
సుపరిపాలనే ధ్యేయంగా
Editor: T. Vivek, Associate Editor: Prof. Raghuram Rao Akkinepally
Vol. No. I | Issue No. 6 | Monthly News Letter | June 2025
IN FOCUS
అడవులను కాపాడుకుందాము

దేశంలో మేలురకమైన టేకు కలప బ్రిటిష్ వారి పడవల తయారీకి అవసరముండడంతో సహజ సిద్ధమైన అడవులను రక్షిత అడవులుగా ప్రకటిస్తూ 1927లో అటవీచట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారము అడవులు
ఆక్రమించడం గాని, అడవులు నరికి పోడు వ్యవసాయం చేయడం కాని చట్టరీత్యా విరుద్ధం. ఈ చట్టంతో అడవులలో నివసించే గిరిజనులకు ఇబ్బందిగా మారి పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలోని గిరిజన తిరుగుబాటుకు గిరిజన నాయకుడు కుమరం భీమ్ సారధ్యంలో ఆందోళన జరగడం, పోలీసు కాల్పులలో కొమరం భీమ్ చనిపోవడం జరిగింది. అప్పుడు నిజాం ప్రభుత్వం 1940లో అంతవరకు, అడవులు ఆక్రమించిన 50 వేల ఎకరాల అడవిభూములు గిరిజనులందరకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అడవుల ఆక్రమణ అంతటితో ఆగక 1970 వరకు సుమారు 2.5 లక్షల ఎకరాల అడవుల ఆక్రమణలకు గురి కాగా అప్పటి ప్రభుత్వం సమస్యకు పరిష్కారంగా గత 30 సంవత్సరాలలో ఆక్రమణకు గురైన 2.5 లక్షల ఎకరాల అటవీ భూములు పట్టాలు చేయడం జరిగింది. ఈవిధంగా రెండుసార్లు అటవీభూముల ఆక్రమణలు పట్టాలు చేయడంతో పక్కరాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో చొరబడి అడవులను ఆక్రమణ చేయడం మొదలైంది. ఈ సమస్య చాలా రాష్ట్రాలలో ఉండడంతో భారత పార్లమెంటు 2006లో అటవీ హక్కుల చట్టం పేరుతో ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారం 2005 సంవత్సరం వరకు అడవులు ఆక్రమించి వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు సమగ్ర విచారణ జరిపి పట్టాలు ఇవ్వాలని నిర్ధేశించింది. ఇందుకొరకై సంబంధిత అధికారులు గ్రామాలలోకి వెళ్ళి గ్రామసభ ఏర్పాటు చేసి గిరిజనుల నుంచి 2005వ సంవత్సరం కంటే ముందు నుంచి తాము అడవులను ఆక్రమించుకున్నామని సరియైన
ఆధారాలు చూపించిన పట్టాలు ఇవ్వాలని నిర్థేశించింది. దీని ప్రకారము గ్రామసభలు జరిపి తగిన ఆధారాలు చూపించిన సుమారు ఒక లక్ష గిరిజన కుటుంబాలకు 3 లక్షల ఎకరాల అడవిభూములు మూడవసారి పట్టాలు ఇవ్వడం జరిగింది..
ఈవిధంగా పెద్ద ఎత్తున అడవిభూములు ఆక్రమించడంతో
పర్యావరణానికి అలాగే వన్యప్రాణులకు హాని కలుగుతుందని ‘వైల్డ్ లైఫ్ ఫస్ట్’ అనే స్వచ్చంద సంస్థ సుప్రీమ్ కోర్టులో అటవీహక్కుల చట్టంపై పిటీషన్ నంబరు 109/ 2008 వేయడం జరిగింది. ఈ మధ్యలో చాలా రాష్ట్రాలలో కొత్తగా నరికిన అడవులు (అంటే 2005 తరువాత) ఆక్రమించిన వారి దరఖాస్తులు తిరస్కరించిన వారిని ఆక్రమిత అడవి భూముల నుంచి బయటకి పంపలేదు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాగా కోర్టువారు 13-2-2019 నాడు తమ తీర్పు వెలువరిస్తూ 2005 తరువాత ఆక్రమణలు చేసిన వారిని
తక్షణమే ఖాళీ చేయించాలని ఆర్డర్ పాస్ చేసినారు. దీనిపై చాలా రాష్ట్రాలు తమ ఇబ్బందులు తెలుపగా తమ ఆర్డర్‌పై స్టే ఇవ్వడం జరిగింది. కేసు కోర్టులోనే ఉంది.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పెద్ద ఎత్తున అడవులు నరకడం మొదలైంది.. అడ్డుకున్న అటవీ అధికారులపై దౌర్జన్యం, చివరకు గొడ్డళ్ళతో నరకడం వరకు వెళ్ళింది. ఈవిధంగా సుమారు 12 లక్షల ఎకరాల అడవి ఆక్రమించడం జరిగింది.
2021లో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆదరబాదరగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను తుంగలో తొక్కి రూల్సు మొత్తము మార్చి, 12 లక్షల ఎకరాలు సహజసిద్ధమైన (నేచురల్) అడవిని కొత్తగా పట్టాలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈవిధంగా పెద్ద ఎత్తున అడవుల ఆక్రమణ వాటి పట్టాలు పర్యావరణానికి, వన్యప్రాణులకు హానికరమని స్టే ఇవ్వమని
కోర్టును ఆశ్రయించగా. కోర్టువారు స్టే ఇవ్వలేదు (పిల్ నం. 7/2023) రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి గౌ// ముఖ్యమంత్రిగారు వివరాలు తెలుపుతూ 12 లక్షల ఎకరాల అటవీభూమి ఆక్రమణకు గురైందని అందులో పోడు వ్యవసాయం చేస్తున్న వారికి పట్టాలు ఇస్తామని తెలిపినారు. ఈవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అడవులు నరకడంతో వన్యప్రాణులు ఆవాసాలు లేకపోవడం చాలా మటుకు అవి తగ్గిపోవడం జరుగుతుంది. తరచుగా పెద్దపులులు, చిరుతలు గ్రామాలలోనికి రావడం, కోతులు, పందులు పంట నష్టం చేయడం, అడవులు నరకడంతో నేల కోతకు గురై మట్టి నదులలో ప్రాజెక్టులలో మేట వేయడం జరుగుతుంది. 2008వ సంవత్సరంలో ‘వైల్డ్ లైఫ్ ఫస్ట్’ అనే సంస్థ అటవీ హక్కుల చట్టంపై వేసిన పిటిషన్ ఇప్పటివరకు సుప్రీమ్ కోర్టులోనే పెండింగులో ఉంది. అలాగే 2023లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు పెద్ద ఎత్తున అటవీ భూములను పట్టాలు ఇవ్వవద్దని వేసిన పిల్ కూడ రాష్ట్ర హైకోర్టులో పెండింగులో ఉంది.
అటవీహక్కుల పుణ్యమా అని రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల అడవిభూములు ఆక్రమణలకు గురైనాయి. ఇంకా ప్రతిరోజు ఏదో ఒక మారుమూల ప్రాంతంలో అడవులు నరుకుతున్నారు. ఇక దేశం మొత్తం మీద లెక్క తీస్తే అటవీ హక్కుల చట్టం వచ్చిన తరువాత చాలా పెద్ద మొత్తంలో అడవులు ఆక్రమించబడ్డాయి.
ఈ మధ్య హైదరాబాదు కంచె గచ్చిబౌలి భూమిలో ఒక వంద ఎకరాల అడవిలో చెట్లు నరికినారని అది కాస్తా సుప్రీమ్‌కోర్టు వరకు వెళ్ళడం, కోర్టువారు దీనిని తీవ్రంగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఇతర ఉన్నత అధికారులను 100 ఎకరాల అడవులను ధ్వంసం చేసి, పర్యావరణాన్ని, వన్యప్రాణులకు హాని కలిగించినందుకు పర్యావరణ పునరుద్ధరణ చేయాలని లేనిచో వారందరిని జైలులో పెడుతామని ఘాటు వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు వాటి కాలువలకు సుమారు 8 వేల ఎకరాల అడవిభూమి తీసుకున్నారు. ఇక గిరిజనాభివృద్ధి
శాఖ వారు చాలామంది గిరిజనేతరులకు తప్పుడు ధృవపత్రాలు ఇచ్చి పోడు వ్యవసాయాన్ని ప్రోత్సహించినారు. చివరగా అప్పటి పాలకులు ఎన్నికలను
దృష్టిలో పెట్టుకొని 12 లక్షల ఎకరాల మంచి వృక్షసంపద, వన్యప్రాణులు గల అడవిభూములను పట్టాలుగా చేయడం చూస్తే గౌ// సుప్రీమ్‌కోర్టు చెప్పినట్లు ఎందరు రాజకీయనాయకులను, ఎందరు అధికారులను జైళ్ళలో
పెట్టాలి అందుకు ఎన్ని కొత్త జైళ్ళు కట్టాలి ?
విదేశాల నుంచి చాలా స్వచ్చంద సేవా సంస్థలు హైదరాబాదు నగర పరిసర ప్రాంతాలలో ఏనుగులు, లేళ్ళు, దుప్పులు, నెమళ్ళు ఉన్న అడవులను ధ్వంసం చేస్తున్నారట నిజమేనా అని వాకబు చేస్తున్నారు. దేశ ప్రధానమంత్రిగారు కూడ తెలంగాణలో అడవుల విధ్వంసం జరుగుతుంది అనడం కూడ విచారకరం. కొన్ని రాజకీయపార్టీలు అధికార పార్టీని బదనాం చేయడానికి కృత్రిమ మేధ ఫొటోలు, వీడియోలు, ఫేక్ పోస్టులతో చేసిన ప్రచారంతో దేశ విదేశాలలో తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు నగరానికి చెడ్డపేరు తెచ్చినారు.
M. Padmanabha Reddy
President
Forum for Good Governance
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఎంతో కీలకం , బాధ్యతాయుతమైనది
బ్రిటిష్ పాలనలో అణచివేతకు గురైన మన భారతీయులు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో జీవించేవారు . దాదాపు 200 సంవత్సరాలపాటు భారతీయులు విదేశీయుల పాలనాధీనంలో జీవించాల్సి వచ్చింది. ఆ సమయంలో భారతీయులకు పాలనా వ్యవస్థలో భాగంగా శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలలో స్థానం దక్కే అవకాశం లేకపోయింది. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎందరో భారతీయులు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలంగా 1947లో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం .
స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం భారతీయులకు దేశ పాలనలో పాల్గొనడానికి అనేక అవకాశాలు లభించాయి. ప్రజలు ఎన్నికల ద్వారా రాజకీయ నాయకుల్ని ఎన్నుకునే హక్కు పొందారు. పోటీ పరీక్షల ద్వారా అధికారుల నియామకం ప్రారంభమైంది. అర్హులైన వారికి ముఖ్యమైన పదవులు లభించాయి.
అవి కేవలం గౌరవప్రదమైన పదవులే కాదు , ప్రజల పన్నులపై ఆధారపడి , ప్రజల శ్రేయస్సును కోరుకునే సేవాభావంతో చేసే పదవులు.
స్వాతంత్ర్య సమరయోధులు స్వతంత్ర భారతదేశంలో పదవుల్లో వయసు రిత్య , ఆనారోగ్యకారణంగా ఎక్కువ కాలం జీవించ లేదు . కానీ వారు పదవుల విలువను, బాధ్యతను బాగా గుర్తించారు. ప్రజలకు న్యాయం చేయడం, పారదర్శక పాలన అందించడం, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడం, వీటిని తమ ధర్మంగా భావించి పని చేశారు.
స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్రను పోషించిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం సాధించిన తరువాత దాదాపు 54 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ , వారసత్వ రాజకీయాలు , అవినీతి ఆరోపణలు, పాలనా అలసత్వము, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వంటి కారణాలతో అనుకున్నంతగా అభివృద్ధి జరగలేదు . బలమైన ఒక ప్రతిపక్షం లేకపోవడం వలన కూడా జరగవలసిన నష్టం జరిగిపోయింది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షానికి విపరీతమైన స్వేచ్ఛ లభించింది . దీంతో దేశ ప్రయోజనాల దెబ్బతినడమే కాకుండా, కొన్ని ప్రాంతీయ అసమానతలకు కూడా దారి తీసి కొన్ని రాష్ట్రాల్లో కొత్త ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి.
వాస్తవానికి, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప , దేశవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రయత్నం జరుగలేదు. మన దేశంలో ఆ సమతుల్యతను సాధించడంలో మనం విఫలమైనాము .
1977లో కాంగ్రెస్ వ్యతిరేకంగా జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా, అంతర్గత విభేదాలతో మూడు సంవత్సరాల్లో అధికారం కోల్పోయింది.
1980లో స్థాపితమైన భారతీయ జనతా పార్టీ కొద్ది కాలంలోనే బలమైన జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. 1996లో మొదటిసారిగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగింది. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చింది
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఎంతో కీలకం ,బాధ్యతాయుతమైనది అనే విషయాన్ని మనం గమనించాలి . బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలదు, తప్పులను ఎత్తిచూపగలదు, ప్రజల హక్కులను రక్షించగలదు.
ప్రజాస్వామ్యంలో పాలకులపై ప్రజల అభిమానం తాత్కాలికమే. అధికారం ఉన్నప్పుడు పొగడ్తలు, అది పోయినప్పుడు విమర్శలు తప్పవు. పదవి ఒక అసిధార వ్రతం , అనగా పదునైన ఖడ్గం అంచున ప్రయాణం, కఠినమైన, జాగ్రత్తగా పాటించవలసిన వ్రతము. చేసే ప్రతి పనిలో ఒక్క తప్పిదం జరిగినా పెద్ద నష్టానికి దారి తీస్తుంది.
పాలకులు ఎన్నడూ తమ పదవులను తలకెక్కించుకోకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తీసుకొని పాలన సాగించాలి. అధికారం తాత్కాలికమైతే, సేవ శాశ్వతంగా మిగలాలి.
ప్రతిపక్షాలు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, నిశితంగా గమనించి, ప్రజల తరఫున మాట్లాడే శక్తిగా నిలవాలి. తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి, దేశ ప్రయోజనాలకోసం పోరాడాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిజంగా పటిష్టంగా ఉంటుంది.
స్వాతంత్ర్య పోరాటం ఫలితంగా మనకు లభించిన హక్కులు, పదవులు మనకు గర్వంగా అనిపిస్తాయి కానీ, వాటి వెనుక ఉన్న బాధ్యతలను మర్చిపోవద్దు. ప్రజల సేవనే ధర్మంగా భావించి పనిచేస్తేనే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలుగుతాము. నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వాల ప్రధాన బాధ్యత.
సమాజంలో ఉన్న అసమానతలను తొలగించాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే విధంగా, అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా పారదర్శకతతో పాలన సాగాలి.
మనుషుల ఆలోచనలు వేర్వేరు. కొందరు తమ ప్రతిభ, కృషితో జీవితం మెరుగుపర్చుకుంటారు. మరికొందరు సాదా జీవితం కోరుకుంటారు. వారి ఇద్దరి ఆవశ్యకతలను, స్వతంత్రతను గౌరవిస్తూ, ప్రభుత్వాలు సమాజానికి సేవలందిస్తూ ప్రజలను స్వావలంబన వైపు నడిపించాలి.
కానీ కొన్నిసార్లు, ప్రభుత్వాలు తమ బాధ్యతలను పక్కన పెట్టి, ఆర్థిక అసమానతలు తొలగించాలనే ముసుగులో, ఓట్ల కోసమే ఉచితాల ప్రలోభాలు చూపుతూ ప్రజలను సోమరులుగా మారుస్తున్నాయంటే అది అత్యంత ప్రమాదకరం. ఇలా ప్రజలను ఉచితాల కోసం ఎదురు చూసే స్థితికి నెట్టివేయడం వల్ల, వారు తమలో ఉన్న ప్రతిభను వెలికి తీయకుండా కాలం గడిపేస్తున్నారు.
ఇలాంటి విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా, సమాజాన్ని దారితప్పించే ప్రమాదం కలదు. ప్రభుత్వాలు ప్రజలలో శక్తి, సామర్థ్యాలను ప్రోత్సహించే విధంగా కార్యాచరణ చేపట్టాలి. దాతృత్వం కంటే ప్రజలకు దిశానిర్దేశము చేయడం ముఖ్యమని నాయకులు గుర్తించాలి.
Syed Rafi (Member of FGG)
కులగణన సమ సమాజం కోసమేనా ?
ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలిపేదే వర్గ విశ్లేషణ అని భారత రాజ్యాంగం భావించితే, కాదు కులమని సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియా పదేపదే తెలిపింది. కుల ఆధారిత జీవనాధార అంతరాల సమాజం మనది. 1931 సెన్సస్ ప్రకారం 4147 కులాలుగా గుర్తించినారు. మన ఆoత్రపాలజీకల్ సర్వే వాళ్ళ ప్రకారం 6325 కులాలు దేశంలో ఉన్నాయి. 2011లో యూపీఏ గవర్నమెంట్ – 2 నిర్వహించిన సోషియోఎకనామిక్ సర్వే ప్రకారం 4673034 కులాలు ఉపకులాలు గోత్రాలు కలిగిన వారిగా గుర్తించడం జరిగింది( దీనిని విడుదల చేయలేదు). ఈ దేశం కులాలమయం. రకరకాల తెగలకు చెందిన వారు జాతుల వారుగా అడవుల్లో సంచార జీవులుగా ఉన్నారు వీరిని గిరిజనులు అంటున్నాము. వర్గ సమాజంగా గుర్తించేఅంత ఆర్థిక అభివృద్ధి దేశంలో లేదు. పేదరికం కులాల మయంగా, తెగలమయంగా ఉంది. దేశంలో కొన్ని కులాల ఆధిపత్యం తెలిసిందే . అభివృద్ధి ఫలాలు అందరికీ అందలేదు. కులగణనలో పెరుగుతున్న ఆదాయాలు ఎవరు సొమ్ము గా మారుతుందో తెలియదు. ఎందుకంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రకారం 2025లో భారత్ స్థూల జాతీయోత్పత్తి నాలుగన్నార ట్రిలియన్ డాలర్లను మించి త్వరలో జర్మనీని అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ఇదిలా ఉంటే ఆక్స్ఫామ్ ప్రచురించిన ఇండియా రిపోర్ట్ 2024 లో 70 శాతం దేశం సంపద 10 శాతం కుటుంబాల చేతుల్లో ఉంది. ఒక శాతం కుటుంబాల చేతుల్లో 40 శాతం జాతీయ సంపద ఉంది ప్రపంచంలోనే అత్యధిక అసమానతలతో కూడుకున్న దేశం మనది. కులగణన ద్వారా ఇది తెలిస్తే అప్పుడు ఏం చేస్తాము. ఆదాయ కల్పన పథకాలు చేపట్టి ఉద్యోగ ఉపాధి కల్పన జరిగితే ఈ ఆదాయ అసమానతలు కొంతవరకు తగ్గవచ్చునేమో? అయితే దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? ఉపాధి కల్పనలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి సంఖ్యదిత్యా చాలా పరిమితమైనవి. ప్రభుత్వ రంగ సంస్థల క్రమంగా ప్రవేట్ పరం అయిపోతున్నాయి అంటే అక్కడ అవకాశాలు తగ్గిపోతున్నాయి. అప్పుడు ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలి అనే డిమాండ్ సహజంగానే ముందుకు వస్తుంది దానికి ప్రభుత్వం సిద్ధమా? ఆర్థిక వ్యవస్థలో ఆదాయ కల్పనలో ఒకప్పుడు ముందు ఉన్న రంగం వ్యవసాయ రంగం అందుకే ఆనాడు సామాజిక న్యాయం కోసం దున్నేవాడికే భూమి అన్నారు. అయితే ఈ ప్రక్రియ అంతంత మాత్రంగానే జరిగి సమాజంలో సామాజిక న్యాయం చేయలేకపోయింది. వ్యవసాయ రంగం తర్వాత అనేక రంగాలు నేడు అభివృద్ధి పథంలో ఉన్నాయి. నూతన ఆర్థిక విధానాలైన లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ చేపట్టిన తర్వాత టెలి కమ్యూనికేషన్స్ ఐటి రెన్యుఓబుల్ ఎనర్జీ, మౌలిక రంగ నిర్మాణాలు ,ఈ కామర్స్ డిజిటల్ ఎకానమీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫార్మాయూటికల్ హెల్త్ కేర్ ఆయిల్ గ్యాస్ పెట్రో కెమికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గనులు సహజ వనరులు కార్పొరేట్ విద్యాసంస్థలు ఇలా అనేక రంగాల్లో ఇప్పుడు సంపద సృష్టి అవుతున్నది. వీటి యాజమాన్యంలో దేశంలో ఉండే అన్ని కులాలకు, తెగలకు స్థానం కల్పిస్తారా? లేదా దేశంలో ఉండే అగ్రవర్ణాల కులాల పెత్తనం కొనసాగిస్తూ ఖనిజ సంపద కోసం అడవుల్లో ఉండే గిరిజనులను చంపేస్తూ దేశ సంపాదననో కార్పొరేట్లకు అప్పగిస్తారా ?
దేశంలో అసంఘటిత రంగంల్లో 83 శాతం వరకు ఉపాధి కల్పించుచున్నది దీనిని సంఘటిత పరచగలమా? ఎందుకంటే దేశ సంపద కార్పొరేట్ల చేతుల్లో ఉంది. వీరి వ్యాపార సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో సామాజిక న్యాయం పాటిస్తరా ? కులగణన ద్వారా గుర్తించిన వెనుకబడిన కులాల వారికి వీరి సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారా ? నీతి అయోగ్ ప్రకారము 2024 లో దేశంలో కోటి మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. 2029- 30 నాటికి రెండు కోట్ల 35 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉంటారని అంచనా. వీరందరూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారే. యువత నిరుద్యోగిత రేటు 9.2 శాతంగా ఉన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలియజేస్తున్నది. ఈ నిరుద్యోగ సమస్యను కులగణన ద్వారా శాస్త్రీయంగా పరిశీలించి అంచనా వేసి సమస్యను తీర్చగలమా?
78 ఏళ్ల స్వాతంత్రం కులగణన నిర్ణయాన్ని గొప్ప చర్యగా భావించడం రాజకీయంగా సభవే కావచ్చు కానీ దాని వెనుక సామాజిక ఆర్థిక రంగాల్లో వైఫల్యమే కొట్టొచ్చినట్లు కనబడుతుంది. వైఫల్యాలు పునరావ్రతం కాకుండా ఎటువంటి చర్యల్ల విధానాలు చేపట్టాలో స్పష్టం చేయకుండా కేవలం కులాలను లెక్కించడం వల్ల జరిగే లాభం పెద్దగా ఉండదు. కులంతో పాటు ఉద్యోగ విద్య ఆస్తులు వివరాలను పక్కాగా సేకరించి వాటిని బహిరంగపరిస్తే రాజకీయ రంగమే చాలా ఒడిదుడుకులకు లోను కావలసి వస్తుంది . కుల జనాభాను బట్టి ఉద్యోగాలు పదవులు ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇది జాతీయ సమస్యగా ఉన్నది. అందుకోసం రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని గట్టిగా కోరుతోంది. దేశవ్యాప్తంగా కుల లెక్కలు అందుబాటులోకి వస్తే ఆ పరిమితి తొలగించాలనే ఒత్తిడి తీవ్రమౌతుంది. ఆర్థికాభివృద్ధి ఫలాలు అందరికీ అందని విధానాలు ఎప్పటిలాగే కొనసాగితే కులం ప్రాంతం ఆధారంగా కొత్త డిమాండ్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. కులాల్లో ఆర్థిక అంతరాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని ఉన్నత న్యాయస్థానాలు చేస్తున్న విజ్ఞప్తులను పట్టించుకోవాల్సిన సమయము వచ్చింది. ఆదాయ సంపద అసమానత్వం మనభారత్లో చాలా తీవ్రంగా ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వచ్చాయి . పరిస్థితిని ఎంతో కొంత చక్కదిట్టడానికి తోడ్పడితేనే కులగణన సార్ధకత లభిస్తుంది. దానికి విరుద్ధంగా జరిగితే ప్రజాస్వామ్యం సంకుచిత భావాలతో సతమతమైపోతుంది హేతుబద్ధత లోపిస్తుంది. పేదరికం నిరుద్యోగాన్ని ఆదాయ అసమానతలను తొలగించుకోవాలనుకునే వారికి కులగనన జనగణన అనే ప్రశ్నలు ఎందుకు వస్తాయి? ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో ఎన్ని ఓట్లు దండుకోవచ్చు అనుకునే వాళ్లకు కులగనన అవసరమేమో ఇదే కదా ఓటు బ్యాంకు రాజకీయమంటే . జనగణలోనే కులగనన చేయకూడదా? జనాభా లెక్కల్లోనే కుల గణన చేసి ఎవరు అభివృద్ధి ఫలాలు అందుకోలేకపోతున్నారు చెప్పగలం. అప్పుడు కుల పరమైన విభజన సమాజంలో ఉండే అవకాశం లేదు. కుల గణన అనేది రాజ్యాంగం పరిధిలోనిది 246 అధికరణం కింద ఏడో షెడ్యూల్లో 69వ జాబితాలో జనాభా లెక్కల ప్రస్తావన ఉంది ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యతని రాజ్యాంగం చెబుతున్నది. అసలు కులాల, తెగల సేకరణతో వారి విద్యా వైద్య ఆర్థిక సామాజిక స్థితిగతులను అంచనా వేసే దిశగా గణాంక వివరాల సేకరణ ప్రక్రియ సమర్థవంతంగా శాస్త్రీయయింగా ఉంటుందా ? ఉంటే తరువాత వివిధ కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన పథకాలు రూపొందించి తద్వారా అయితే వెనుకబడిపోయారో వారికి నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన వాటిని చేపట్టే ప్రభుత్వాలు ఉంటాయా? తద్వారా సామాజిక న్యాయం జరుగుతుందా? కులగణనలనను రాజకీయ ఆయుధంగా చూస్తున్న వారికి అందరి అభివృద్ధి జరిగే దిశగా దేశంలో పాలన ఉంటుందా ? ఇప్పటివరకు అయితే జరిగిన వృద్ధి అంతా కొందరిగానే ఉన్నది . వృద్ధి అనేది అందరిది గాని కొందరిది కాదని మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారు. డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు
డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
(గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్)
శాంతినగర్ ఎం.ఆర్.పల్లి
తిరుపతి
FGG IN NEWS
FGG IN ACTION
FGG Submitted representations to various departments in the month of MAY 2025
– To the Prl. Secretary, School Education. department regarding Purchase of Books, Bags
etc. in Schools – on 20-5-2025
– To the Chief Minister regarding Hussain Sagar cleaning – on 21-5-2025
– To the Union Minister of Tribal Welfare department regarding Recognition of Forest Rights Act – on 21-5-2025
– To the Chairman, Central Empowered Committee, New Delhi regarding PODU – on 26-5-2025
– To the Director General, V&E department, regarding unauthorised constructions – on 27-5-2025
– To the Director General, V&E department, regarding. V&E reports – on 27-5-2025
– To the Commissioner, Vigilance Commission, regarding Secretariat lands – on 29-5-2025
– To the Director General of Police, ACB regarding progress of ACB cases – on 29-5-2025
– To the Commissioner, Vigilance Commission, regarding Commercial Tax Department Check posts – on 30-5-2025
– To the Director General of Police, regarding Village Development Committees – on 30-5-2025
– To the Chief Minister, regarding Dalita Bandhu – on 30-5-2025
పనిలేక పస్తులుండి, పని కోసం వలస వెళ్లే వారిని కొందరిని చూస్తాం. కూటికోసం కోటీ విద్యలు నేర్పుకుని పని చేసిన జీతం రాక మరికొందరైతే, ప్రతి నెల జీతం పోందుతూ, చెయ్యాల్సిన పని చేతినిండా వున్నా లంచం కొరకూ కాలయాపన చేస్తూ కొందరు ఉద్యోగులను చూస్తే జాలి వేస్తుంది.
FGG submitted following RTI letters to various departments in the month of MAY 2025
1. To the PIO, O/o Prl. Secretary, School Education department, Govt. of Telangana regarding fake medical bills – on 19-5-2025
2. To the PIO, O/o Director, Tribal Welfare department regarding PODU – on 20-5-2025
3. To the PIO. O/o Prl. Secretary to Government, GAD regarding action taken on representation on Income Tax paid to Ministers – on 20-5-2025
4. To the PIO, O/o Village Panchayat Secretary, Zenwada regarding G.O. Ms. No. 111 – on 21-5-2025
5. To the PIO, O/o Station House Officer, Dundigal Police Station regarding further information of old ref. – on 27-5-2025
6. To the PIO, O/o Commissioner, Vigilance Commission regarding film nagar lands – on 27-5-2025
7. To the PIO, O/o Prl. Secretary, Planning department regarding MPLADS – on 27-5-2025
8. To the PIO, O/o Prl. Secretary, Agri. & Co-op. department, regarding fake Ag. BSc certificates – on 29-5-2025
9. To the PIO, O/o Prl. Secretary, MA&UD department regarding old. Ref. of cases on Thasildar – on 28-5-2025
10. To the PIO, O/o Commissioner, Transport department regarding cases facing officials – on 28-5-2025
11. . To the PIO, O/o Director General, V&E department regarding action taken on representation of TNGOs land – on 28-5-2025
12. . To the PIO, O/o Chief Election Commissioner, ECI, New Delhi regarding action taken on representation of wasteful expenditure – on 28-5-2025
13. To the PIO, O/o Commissioner, Vigilance Commission regarding action taken on representation of Chitrapuri lands – on 29-5-2025
14. To the PIO, O/o Engineer – In – Chief, regarding SLBCs – on 30-5-2025
FGG TIMES
M. Padmanabha Reddy I.F.S.(R) (President)